కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా పరిచయమైనటువంటి నటి శ్రీ లీల( Sreeleela ) తెలుగులో పెళ్లి సందడి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా ఈమె మాత్రం తన అందం నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ఈ సినిమా తర్వాత ధమాకా( Dhamaka ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి శ్రీ లీల ఈ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుని ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.శ్రీ లీల ప్రస్తుతం 10 సినిమాలకు పైగా అవకాశాలను అందుకొని వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా శ్రీ లీల తనకు కాబోయే భర్త( Future Husband )లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయాలను గురించి వెల్లడించారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు కాబోయే భర్త మాటమీద నిలబడే స్వభావం ఉన్నవారు అయ్యి ఉండాలి అలాగే ప్రతి విషయంలోను ఎంతో ఓపికగా వ్యవహరించాలి, అందరితోను సరదాగా కలిసిపోవాలి.ముఖ్యంగా పెద్దవారిని గౌరవించాలి.
ఇలా ఈ క్వాలిటీ తనకు కాబోయే భర్తలో తప్పనిసరిగా ఉండాలని ఈమె తెలియజేశారు.
ఇక ఇదివరకు ఎవరినైనా ప్రేమించారా అనే ప్రశ్న కూడా ఎదురు కావడంతో ఈమె తన ఫస్ట్ లవ్ తన అమ్మేనని తాను తన అమ్మతోనే మొదటిసారి ప్రేమలో పడ్డాను అంటూ ఈ సందర్భంగా సమాధానం చెప్పారు.ఇలా శ్రీలీల తనుకు కాబోయే భర్తలో ఉండే క్వాలిటీ గురించి తెలియజేయడంతో ఈ వార్త వైరల్ గా మారింది.ఇక ధమాకా సినిమా తర్వాత శ్రీ లీల తన తదుపరి చిత్రం స్కంద( Skanda ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో హీరో రామ్( Ram ) సరసన శ్రీ లీల ఈ సినిమాలో నటించారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.