Special Story : 'దర్శకధీరుడు' రాజమౌళి వీరగాధ ?

తన కలాన్ని కాలంతో ముడిపెట్టి తన డైరెక్షన్ తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ స్టార్ లా ఇమేజే కాదు తెలుగు సినిమా ఖ్యాతిని కూడా గణనీయంగా పెంచుతున్న దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. తన కెరియర్ లో ఇప్పటి వరకు 13 చిత్రాలు ప్రతి సినిమా ప్రత్యేకమే, ప్రతీది బ్లాక్ బస్టరే… ఇక ఇటీవల కాలంలో ఈ దర్శకుడి అద్భుత సృష్టి నుండి వచ్చిన బాహుబలి, బాహుబలి 2 , ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు అయితే ఏకంగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని అందరి మన్నలను పొందాయి.

 Special Story : ‘దర్శకధీరుడు’ రాజమౌ�-TeluguStop.com

కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త రికార్డులను అందుకున్నాయి.బాహుబలి 2 సినిమాతో మొట్ట మొదటి సారిగా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని 1000 కోట్ల క్లబ్ లో చేరేలా చేశారు ఈ మహా దర్శకుడు.100 కోట్లు వస్తేనే అద్భుతం అనే రోజుల నుండి 1000 కోట్ల మార్క్ ను కూడా దాటే సత్తా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉందంటూ నిరూపించారు.

ఇక ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ చిత్రం కూడా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి మరోసారి టాలీవుడ్ స్టామినా చూపి బాక్స్ ఆఫీస్ వద్ద క్లాప్ కొట్టించుకుంది.

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అని గుర్తొచ్చేలా చరిత్ర సృష్టించారు దర్శకుడు రాజమౌళి.ఒకప్పుడు ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాట వినిపిస్తే అంతా బాలీవుడ్ వైపు చూసే వారు కానీ ఇపుడు రోజులు మారాయి.

మన తెలుగు దర్శకులు తమలోని టాలెంట్ కి మరికాస్త తెగువను జోడించి భారీ చిత్రాలు తీస్తున్నారు, పదునైన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ పైకి గురిపెట్టి వదులుతున్నారు.

Telugu Baahubali, Prasanth Neel, Rajamouli, Kgf, Pushpa, Rajamouli Story, Shanka

అంతేనా టార్గెట్ ను రీచ్ అయ్యి భళా అనిపిస్తున్నారు.మన తెలుగు దర్శకులు, అయితే ఒకప్పుడు మాదే పైచేయి అన్న కొందరు బాలీవుడ్ దర్శకులు సైతం ఇపుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బాషా భేదంతో ముక్కలు చేస్తూ మాట్లాడకండి అంటూ మాటలు కలిపేస్తున్నారు.

ఏదేమైనా మనమంతా భారతీయులం బాష వేరైనా మన భారత మాతకు జేజేలు పలికేలా మనవంతు ప్రయత్నం చేయాలి అంటూ తమ గొప్పతనాన్ని చాటుతున్నారు మన దర్శకులు.

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం నేను కూడా అంటూ కెజీఎఫ్ చిత్రం తో చరిత్ర సృష్టించాడు.ఈ సినిమా హవా ఇప్పట్లో తగ్గేలా లేదు.మొదటి బాగమే అనుకుంటే చాప్టర్ 2 ని అంతకన్నా మిన్నగా డైరెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దద్దరిల్లేలా చేశారు.

Telugu Baahubali, Prasanth Neel, Rajamouli, Kgf, Pushpa, Rajamouli Story, Shanka

ఇప్పటికే 1000 కోట్ల బజ్ ను దాటిన ఈ సినిమా కలెక్షన్స్ 2000 కోట్లకు చేరుకుంది ఆశ్చర్యం లేదని అంటున్నారు.పుష్ప చిత్రం తోను బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసి కాసుల వర్షం కురిపించారు దర్శకుడు సుకుమార్. ఇలా టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, సుకుమార్ వంటి వారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి అంతకు మించిన స్థాయికి తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

ఏదేమైనా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ స్టైల్, వైభవం మాత్రం మరింకెవరికి రాదంటున్నారు సినీ ప్రేమికులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube