ఇద్దరు భారతీయ అమెరికన్ల ఘనత.. ఈ ఏడాది టాప్ 50 ఐటీ లీడర్ల జాబితాలో స్థానం..!!

ప్రతిష్టాత్మక స్టేట్ స్కూప్ టాప్ 50 -2022 జాబితాలో ఇద్దరు భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు.టెక్సాస్‌కు చెందిన కృష్ణకుమార్ ఎడథిల్, జార్జియాకు చెందిన నిఖిల్ దేశ్‌పాండేలు ఈ ఘనత సాధించారు.

 Two Indian-american Technocrats Among Top 50 It Leaders Of The Year, Krishnakuma-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత సమర్ధవంతంగా , ప్రభావవంతంగా మార్చడంలో కృషి చేసిన వ్యక్తులకు స్టేట్‌స్కూప్ 50 అవార్డులు అందజేస్తారు.మేరీల్యాండ్‌లోని నేషనల్ హార్బర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ చీఫ్ ఆఫీసర్స్ (ఎన్ఏఎస్‌సీఐవో) మిడ్ ఇయర్ కాన్పరెన్స్‌తో కలిసి విజేతలకు అవార్డులను అందజేశారు.

స్టేట్ ఐటీ లీడర్ ఆఫ్ ది ఇయర్‌గా కృష్ణకుమార్, స్టేట్ లీడర్‌షిప్ ఆఫ్ ద ఇయర్‌గా దేశ్‌పాండే ఎంపికయ్యారు.టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ (డీఐఆర్)లో ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్ సర్వీసెస్ డైరెక్టర్‌గా వున్న కృష్ణకుమార్ ఎడతిల్ అమెరికాలో క్లౌడ్ ర్యాంకింగ్ విషయంలో టెక్సాస్‌ను ముందుకు నడిపించారు.అంతేకాదు.రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కూడా ఆయన ప్రారంభించారు.

సాంకేతిక రంగంలో కృష్ణకుమార్ సేవలకు గుర్తింపుగా ఆయన ఈ అవార్డులకు నామినేట్ అయ్యారు.

ఈ సందర్భంగా టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ (డీఐఆర్) స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమండా క్రాఫోర్డ్ మాట్లాడుతూ.

టెక్సాస్‌లో సాంకేతికత ఆధునికీకరణ ప్రయత్నాలను వేగవంతం చేయడంలో కృష్ణ కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు.తమ కస్టమర్ ఏజెన్సీల డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీలో ఆయన విశ్వసనీయ భాగస్వామి అని అమండా అన్నారు.

Telugu Executiveamanda, Texas, Indianamerican-Telugu NRI

ఇక నిఖిల్ దేశ్‌పాండే విషయానికి వస్తే.ఆయన జార్జియాకు దీర్ఘకాలంగా చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.సోషల్ మీడియాలో జార్జియా ఉనికిని కాపాడటంలో, ఎంటర్‌ప్రైజ్ వైడ్ ఓపెస్ సోర్స్ పబ్లిషింగ్ సిస్టమ్‌కు తరలించడంలో కీలకపాత్ర పోషించారు.ఇటీవలే.దేశ్‌పాండే బృందం వారి డిజిటల్ సేవలను మెరుగుపరచడానికి పలు ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube