అక్క‌డి ప్రజల వయస్సు పెద్ద‌ పజిల్‌.. పుట్టిన కొన్ని వారాల‌కే రెండేళ్లు

కొరియన్ ప్రజలు తమ అందానికి యవ్వన ప్రాయానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు.మెరిసే చర్మాన్ని ద‌క్కించుకునేందుకు కొరియన్ ప్రజలను చూసి ఇత‌ర దేశాల వారు వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు.

 South Koreans Become A Year Old In Few Weeks Details, South Koreans, South Korea-TeluguStop.com

అయితే ఇక్కడి ప్రజల వయస్సు ఒక పజిల్‌గా మిగిలిపోయింది.ఇక్కడి ప్రజల వయసు కొద్ది రోజుల వ్య‌వధికే పెరిగిపోతుంది.

బిడ్డ పుట్టిన కొన్ని వారాలకే ఆ బిడ్డ‌ వయస్సు 2 సంవత్సరాలుగా ప‌రిగ‌ణిస్తారు.దక్షిణ కొరియాలో వ్యక్తుల వయస్సును నిర్ణయించడానికి ఒక స్ప‌ష్ట‌మైన విధానం లేదు.

ఇక్కడి ప్ర‌జ‌ల‌ వయస్సు అనేక పురాత‌న ప‌ద్ధ‌తుల‌లో లెక్కిస్తారు.మన దేశంలో ఒక వ్యక్తి పుట్టిన తేదీ, సంవత్సరాన్ని అనుస‌రించి అతని వయస్సు నిర్ణయిస్తారు.

దక్షిణ కొరియాలో ఈ పద్ధతి కొద్దిగా భిన్నంగా ఉంటుంది.ఇక్కడ సంవత్సరాల మార్పుతో వ్యక్తి వయస్సు కూడా మారుతుంది.

వాస్తవానికి, దక్షిణ కొరియాలో వయస్సును లెక్కించడానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పద్ధతి ఏదీ లేదు.దక్షిణ కొరియాలో ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డ‌కు ఒక సంవత్సరం వయస్సుగా పరిగణిస్తారు.

దక్షిణ కొరియాలో వయస్సును లెక్కించడానికి ఇదే అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి.అటువంటి పరిస్థితిలో దక్షిణ కొరియాలో ఒక బిడ్డ డిసెంబర్లో జన్మించినట్లయితే, త‌దుప‌రి జనవరి రాగానే ఆ బిడ్డ వ‌య‌సును 2 సంవత్సరాలుగా ప‌రిగ‌ణిస్తారు.

అదే సమయంలో ఒక‌ రోజు పిల్లల వయస్సు కూడా ఒక సంవత్సరం వయస్సుగా పరిగణిస్తారు.వయస్సును లెక్కించడానికి ఇక్కడ మరొక మార్గం కూడా ఉంది.

Telugu Born, Age, Korean, Koreans, Koreans Age-Latest News - Telugu

ఒక బిడ్డ జన్మించినప్పుడు ఆ శిశువు వయసు ఏడాదిగా పరిగణిస్తారు.ప్రతి సంవత్సరం జనవరి ఒక‌టిన అంద‌రి వ‌య‌సు పెరుగుతుంది.దీనికి పుట్టిన నెల లేదా తేదీతో సంబంధం లేదు.ఒక‌ నివేదిక ప్రకారం త్వ‌ర‌లో దక్షిణ కొరియాలో వయస్సును లెక్కించే అధికారిక పద్ధతిని రూపొందించ‌బోతున్నారు.ఇది చట్టబద్ధం చేసినట్లయితే ఇక్కడి ప్రజల వ‌య‌సు అకస్మాత్తుగా మారిపోనుంది.బీబీసీ నివేదిక ప్రకారం ఈ మార్పు కార‌ణంగా దేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది.

సామాజికంగా ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube