వైరల్ అవుతున్న మాస్ట్రో 'స్నేక్ పీక్' వీడియో !

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.బాలీవుడ్ లో హిట్ అయిన ‘అంధాదున్’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Sneak Peek Released From Nithin Maestro Movie, Nithin, Maestro, Andudan Remake,t-TeluguStop.com

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా కీలక పాత్రలో నటిస్తున్నా విషయం విదితమే.

బాలీవుడ్ లో టబు నటించిన పాత్రలో తమన్నా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు వల్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

క్రైం త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ అంధుడి పాత్రలో కనిపించ బోతున్నాడు.ఒక మర్డర్ కేసును నితిన్ ఎలా డీల్ చేస్తాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.

ఈ సినిమా త్వరలోనే ఓటిటీ సంస్థ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఈ సినిమాను రాజ్ కుమార్ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే తాజాగా ఈ సినిమా నుండి స్నేక్ పీక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ వీడియోలో నితిన్ పియానో వాయిస్తూ కనిపిస్తున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.బాలీవుడ్ లో సూపర్ హిట్ అవ్వడం వల్ల ఆ సినిమాకు రీమేక్ గా చేస్తున్న మాస్ట్రో సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే ప్రేక్షకులు భావిస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 10 న ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది.అందుకే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగంగా చేస్తున్నారు.ఈ సినిమాను జనాలకు దగ్గర చేయాలనీ తరచు అప్డేట్ లు ఇస్తున్నారు.

https://youtu.be/uOz_YrbmGh4
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube