వైరల్ వీడియో: ఒక్క క్షణం విలువ ఏంటో ఈ చిన్నారి ప్రాణం మీకు చెబుతుంది..!

రోడ్డు ప్రమాదాల వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలు రోడ్డున పడిన సంఘటనలను గురించి మనం చాలానే విని ఉంటాము.అందుకే రోడ్డు మీద వెళ్లేట‌ప్పుడు ఎంతో జాగ్ర‌త్త‌గా వెళ్లాల‌ని పెద్దలు అంటూ ఉంటారు.

 Small Girl Saved By Falling Under Truck In Fraction Of Seconds Details, Kid, Vir-TeluguStop.com

డ్రైవింగ్ చేసేటప్పుడు గాని, నడిచి వెళ్ళేటప్పుడు గాని ముందు వెనుక చూసుకుంటూ వెళ్ళాలి.అలాగే రోడ్డు మీద అతి వేగంగా ప్రయాణించడం కూడా మంచిది కాదు.

మరి ముఖ్యంగా పిల్ల‌ల‌ను తీసుకొని రోడ్డు మీదకి వెళ్లిన‌ప్పుడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ప్రమాదాలు జరగవచ్చు.

అందుకే ఎప్పటికప్పుడు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి.

ఎందుకంటే పిల్లలకు ఏమి తెలియదు కాబట్టి.పెద్దలు జాగ్ర‌త్త‌గా లేకుంటే పిల్లలకు రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతాయి.

సరిగ్గా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.బాగా వాహనాలతో రద్దిగా ఉన్న రోడ్డు మీదికి ఒక చిన్నారి ప‌రిగెత్తుకుంటూ వచ్చింది.

సరిగ్గా అప్పుడే ఆ రోడ్డు మీదకి వేగంగా ఒక పెద్ద ట్ర‌క్కు ముందుకు దూసుకుని వస్తుంది.అదే స‌మ‌యంలో ఆ చిన్నారి రోడ్డు మీదికి ప‌రిగెత్తుకుంటూ వెళ్లింది.

అక్కడే ఉన్న ఒక వ్యక్తి అది గమనించి ప‌రిగెత్తుకుంటూ వెళ్లి ఆ చిన్నారిని వెన‌క్కి లాగాడు.

కళ్ళు మూసి తెరిచేలోగా ఆ వ్యక్తి ఆ చిన్నారిని కాపాడాడు.అతడు కాపాడలేకుంటే ఆ పాప ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.నిజానికి వీడియోలో కనిపించే వ్యక్తి ఆ చిన్నారి కోసం తన ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టి మరి ఆ చిన్నారిని కాపాడాడు.

వీడియోలో కనిపించే వ్యక్తి ఆ పాప వెంట ప‌రిగెత్త‌డం ఒక్క క్ష‌ణం ఆల‌స్య‌మైనా సరే ఆ చిన్నారి ప్రాణాలు పోయేయి.ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో రోడ్డు మీద గల సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది.

అయితే ఆ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో అనే విషయం తెలియ‌దు కానీ ఈ వీడియోను రెడిట్‌లో పోస్ట్ చేయ‌గా అది ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.నెటిజన్లు సైతం ఈ వీడియోలో కనిపించే వ్యక్తి చేసిన సాహసాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube