నాగార్జున సినిమాకు ఓకే చెప్పడంతో మృణాల్ ఠాకూర్ కు యంగ్‌ హీరో అవకాశం మిస్‌

సీతారామం సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మృనాల్ ఠాకూర్ టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేసేందుకు కమిట్ అవుతుంది.ఇటీవల నాని హీరో గా రూపొందబోతున్న ఒక సినిమా లో హీరోయిన్ గా నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

 Sitaramam Heroine Mrunal Thakur Movie With Nagarjuna Details, Mrunal Thakur, Nag-TeluguStop.com

మరో వైపు నాగార్జున హీరో గా ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వం లో రూపొందబోతున్న ఒక సినిమా లో కూడా మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్ గా ఎంపిక అయిందని ప్రచారం జరుగుతుంది.

మరో వైపు ఈ అమ్మడు సీనియర్ హీరో నాగార్జున తో సినిమా చేసేందుకు ఓకే చెప్పడం తో టాలీవుడ్ లో పలు సినిమా ఆఫర్స్ మిస్ అవుతున్నాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఆ మధ్య ఒక మెగా యంగ్ హీరో తో వచ్చిన సినిమా అవకాశం మిస్ అయింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆరు పదుల వయసున్న హీరో నాగార్జున తో సినిమా చేయడం వల్ల యంగ్ హీరో లతో ఈమె సినిమా లు చేసేందుకు అవకాశాలు తగ్గుతాయి అనేది కొందరి అభిప్రాయం.

Telugu Prasannakumar, Mrunal Thakur, Nagarjuna, Nagarjunamrunal, Nani, Sitaramam

ఆ విషయం తెలుసుకోకుండా అనవసరంగా నాగార్జున హీరో గా నటిస్తున్న సినిమా కు కమిట్ అయిందంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.మరో వైపు నాగార్జున సినిమా సక్సెస్‌ అయితే కచ్చితంగా ఈ అమ్మడి వెంట యంగ్‌ హీరో లు ఈమె వెంట పడడం ఖాయం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Prasannakumar, Mrunal Thakur, Nagarjuna, Nagarjunamrunal, Nani, Sitaramam

మొత్తానికి మృణాల్‌ ఠాకూర్‌ యొక్క కెరియర్ ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఒకప్పుడు హిందీ ఆడియన్స్ మాత్రమే ఈమె ను గుర్తించే వారు.కానీ ఎప్పుడు అయితే సీతారామం సినిమా లో నటించిందో అప్పటి నుండి కూడా ఈ అమ్మడి యొక్క క్రేజ్ అమాంతం పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube