అమ్మ మీద కోపం తో ప్రాణాల మీదకు తెచ్చుకున్న సిరి వెన్నెల

ఒకానొక సమయంలో తన గురించి తాను చెప్పుకున్నాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.తన పాటలు ఎలా ఉన్నాయి? అనే ప్రశ్న వచ్చినప్పుడు.గొప్పగా తన గురించి చెప్పుకున్నాడు.నేను బలహీనమైన పాటలు రాసి ఉండొచ్చు.కానీ చెడ్డ పాటలు మాత్రం రాయలేదు అన్నాడు సీతారామశాస్త్రి.తన సాహిత్యంపై తనకున్న అపార గౌరవం అది.శాస్త్రి తండ్రి వెంకటయోడి ఓ హోమియోపతి వైద్యుడు.ఆయనకు 13 దేశీయ భాషలతో పాటు రెండు విదేశీ భాషలు కూడా తెలుసు.ఆయా భాషల్లో విద్యార్థులకు ట్యూషన్లు కూడా చెప్పేవాడు.అంతటి ప్రతిభాశాలి తను.ఆయన పెద్ద కుమారుడిగా జన్మించాడు శాస్త్రి.కేవలం 10 ఏండ్ల వయసులోనే సంస్కృత భాష‌ను బాగా వంట బట్టిచ్చుకున్నాడు సిరివెన్నెల.

 Siri Vennela Childhood Unknown Facts, Siri Vennela, Sirivennela Sitarama Sastri,-TeluguStop.com

తన తండ్రి నుంచి వచ్చిన శక్తి కాబోలు.

చిన్నప్పటి నుంచి తండ్రిని చూసి పుస్తకాలు బాగా చదివేవాడు సిరివెన్నెల.

పుస్తకాలు చదవడం మూలంగా ఆయనకు సాహిత్యం పట్ల గొప్ప ప్రతిభ ఏర్పడింది.అందరి పిల్లల్లాగే తను కూడా ఓసారి బాగా అల్లరి చేశాడు.అయితే తన తల్లి గట్టిగా మందలించింది.అప్పుడు తను చేసిన తుంటరి పనికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.ఏకంగా హాస్పిటల్ కు కూడా వెళ్లాల్సి వచ్చింది.రెండు రోజుల పాటు స్పృహ‌లేకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

రెండు రోజుల పాటు ఇంట్లో వాళ్లందరికీ కంటి మీద కునుకు లేకుండా చేశాడు.ఎప్పుడు తను మాట్లాడుతాడా? అని ఆతురతగా ఎదరురు చూశాడు.

Telugu Languages, Siri Vennela, Sirivennela-Telugu Stop Exclusive Top Stories

మూడో రోజు సీతారామశాస్త్రి స్పృహ లోకి వచ్చాడు.అప్పుడే తన తండ్రి ఓ మాట చెప్పాడు.అబ్బాయ్.అమ్మంటే కథల్లో రాసి ఉన్నట్లుగా, ఊహల్లో ఊహించుకోవద్దని చెప్పాడు.అమ్మ కూడా మామూలు మనిషే అని చెప్పాడు.అమ్మతనం అంటే కనిపించేది, వినిపించేది కాదని చెప్పాడు.

ఆ తర్వాత కాలంలో ఒక పాటను కూడా రాశాడు.అమ్మంటే ఎవ‌రంటే చూపించే వేలుంటే.

ఆ వేలుకి తెలిసేనా అమ్మంటే అనే మాట‌లు రాశాన‌ని చెప్తాడు సిరివెన్నెల.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube