సోల్ మేట్ గురించి సిరి హన్మంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నెట్టింట్లో వైరల్!

యూట్యూబ్ వీడియోస్ వెబ్ సిరీస్, బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతోమంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సిరి హన్మంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ విధంగా బుల్లితెర నటిగా, యూట్యూబర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.

 Siri Hanmant Interesting Comments About Soul Mate Viral On Social Media Siri Ha-TeluguStop.com

అయితే ఈ కార్యక్రమం ద్వారా తనకు ఉన్న పాజిటివ్ మొత్తం పోగొట్టుకొని పూర్తిగా నెగిటివిటీ ఎదుర్కొంది.ప్రతిరోజు షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి హగ్గులు, కిస్సులు అంటూ శృతిమించి ప్రవర్తించడం వల్ల ప్రేక్షకులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

చివరికి వీరి ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లో కి వెళ్ళినప్పుడు ఏకంగా ఇద్దరు కూడా హగ్  ఇచ్చుకోవడం తగ్గించాలని ఆ విషయం తమకు ఏమాత్రం నచ్చడం లేదంటూ వీరికి గట్టిగా బుద్ధి చెప్పిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా వీరిద్దరూ విపరీతమైన నెగిటివిటీ మూట కట్టుకొని బయటికి వచ్చారు.

ఇక పోతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ దీప్తి సునైనా తనకు బ్రేకప్ చెప్పిన సంగతి మనకు తెలిసిందే.అదే విధంగా సిరి కూడా బయటకు వచ్చిన తర్వాత తనపై వచ్చిన నెగెటివ్ కామెంట్లను చూసి ఎంతో బావోద్వేగం అయ్యారు.

ఈ విధంగా సిరి, శ్రీహాన్ కూడా చాలా దూరంగా ఉన్నారని వీరు కూడా త్వరలోనే బ్రేకప్ చెప్పుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.ఈ క్రమంలోనే తనపై వచ్చిన నెగిటివ్ వీటిని దృష్టిలో ఉంచుకుని కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సిరి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ మేట్ జేస్సితో కలిసి రీల్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి తాజాగా చేసిన రీల్ లో భాగంగా మీ సోల్ మేట్ ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నకు సిరి మీతోనే ఉన్నారు అంటూ సమాధానం చెప్పారు.

ఇక దానికి ప్రజలు ఏమి చెప్పినా వాటి గురించి పట్టించుకోను నా కథ నాకు మాత్రమే తెలుసు నేను ఎంత అనుభవించాను నాకే తెలుసు నేను నిజమైన వ్యక్తిగా పుట్టాను అందరిని నమ్మించడానికి కాదు అంటూ కామెంట్ చేశారు.

Siri Hanmant Interesting Comments About Soul Mate Viral On Social Media Siri Hanmant, Actress, Comment, Soul Mate, Viral, Social Media, Biggboss , Jessey - Telugu Actress, Biggboss, Jessey, Siri Hanmant, Soul Mate

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube