సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ప్లే బ్యాక్ సింగర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా వివిధ భాషలలో ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న వారిలో సింగర్ శ్రేయ ఘోషల్ ఒకరు.
ఇలా ఈమెపాటలకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి ఒకానొక సమయంలో ఈమె పాడిన పాట కోసమే చాలామంది థియేటర్లకు వెళ్లేవారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రేయ ఘోషల్ తన కెరీర్ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రేయ ఘోషల్ మాట్లాడుతూ తాను దేవదాసు సినిమా కోసం మొదటిసారి పాట పాడానని తెలిపారు.ఈ సినిమాలో పాట పాడే సమయంలో నా వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని ఆ సమయంలో స్టూడియో మొత్తం సంగీత దర్శకులు, సంగీత విద్వాంసులు అక్కడ ఉన్నారని ఇప్పటికి ఆ సంఘటన నా కళ్ళు ముందు కదులుతూనే ఉందని తెలిపారు.ఇక తాను ఇప్పటికీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకా చిన్న పిల్లలాగే ఉన్నాననే భావన తనకు కలుగుతుందని తెలిపారు.
చిన్నప్పటినుంచి నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టం ఈ క్రమంలోనే తాను సంగీతంపై మక్కువ పెంచుకొని నేడు ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు.సంజయ్ లీలా బన్సాలీ గురించి మాట్లాడుతూ ఆయన ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా సంగీతలో కూడా పట్టు ఉందని తెలిపారు.నేను ఆయనని స్ఫూర్తిగా తీసుకుంటున్నాను అని చెప్పడానికి చాలా గర్వపడుతుంటానని తెలిపారు.
సంగీతం పై ఉన్న మక్కువతో తాను ఇంట్లో ఉన్నప్పుడు చేసే ప్రతి పనిలోనూ తనకు సంగీతం అంటే ఎంత ఇష్టమో తెలుస్తుందని అందుకే నన్ను ప్రజలు ఇంకా ఆదరిస్తున్నారని శ్రేయ ఘోషల్ ఈ సందర్భంగా తెలియజేశారు.