ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్న తర్వాత అదే విషయాన్ని చాలా ఆలస్యంగా బయట పెడుతున్నారు.అంతేకాకుండా వారి పెళ్లికి సంబంధించిన ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు.
ఈ మధ్యకాలంలో చాలావరకు సెలబ్రిటీలు ఎక్కువగా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతోమంది ఆ విధంగా పెళ్లి చేసుకుని ఊహించిన విధంగా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కొంతమంది కొంచెం ఆలస్యంగా అయినా పెళ్లి విషయాన్ని బయటపడుతుండగా ఇంకొంతమంది మాత్రం అయిన విషయాన్ని చాలా గొప్యంగా ఉంచుతున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఓ స్టార్ సింగర్ కూడా ఇలాగే పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చాడు.స్టార్ సింగర్ నటిని నెల క్రితమే వివాహం చేసుకొని అదే విషయాన్ని తాజాగా వెల్లడించాడు.ఆ స్టార్ సింగర్ మరెవరో కాదు సింగర్ హర్షిత్ సక్సేనా.నెల రోజుల క్రితమే ఓ నటిని పెళ్లి చేసుకున్నాను అంటూ తాజాగా ప్రకటించాడు.ఆ వార్త విన్న అభిమానులు నిజమా అంటూ షాక్ అవుతున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షిత్ సక్సేనా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.నటి సమోనికా శ్రీవాత్సవను ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాను అని తెలిపాడు.
మాది పెద్దలు కుదిర్చిన వివాహం.ఇక పెళ్లికి రెండు రోజుల ముందే మా నిశ్చితార్థం జరిగింది.తర్వాత అతి కొద్దిమంది బంధువల సమక్షంలో మా పెళ్లి జరిగింది.మా పెళ్లి ఛత్తీస్ ఘడ్ లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగింది అని చెప్పుకొచ్చాడు హర్షిత్.
అనంతరం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి విషయాన్నీ దాచడానికి గల కారణాలు కూడా వెల్లడించారు.వరుసగా తనకు సింగింగ్ షెడ్యూల్స్ ఉండటంతో, ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు.
అయితే ఫ్రెండ్స్ కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని హర్షిత్ అన్నాడు.ఇక నేను, సమోనికా ఫస్ట్ టైమ్ ముంబైలో కలిశాము.
అప్పటి నుంచి మా మధ్య పరిచయం పెరిగింది.అయితే మా పరిచయాన్ని మా ఇంట్లోవాళ్లు ప్రేమగా భావించారు.
సమోనికా అమ్మ మా తల్లిదండ్రులతో మాట్లాడటంతో మా వివాహనికి అడుగులు పడ్డాయి అని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.