సింగపూర్: డ్రంకెన్ డ్రైవ్, తప్పించుకునేందుకు పోలీసులకు లంచం... భారత సంతతి వ్యక్తికి జైలు

మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదానికి కారణమవ్వడమే కాకుండా.నేరం నుంచి తప్పించుకునేందుకు పోలీస్ అధికారికి లంచం ఇవ్వబోయిన కేసులో భారత సంతతి వ్యక్తికి బుధవారం సింగపూర్ కోర్ట్ నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 5,000 సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.

 Singapore Court Jails Malaysian-indian For Trying To Bribe Policeman In Drunk St-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.కృష్ణారావు నరసింహ నాయుడు అనే 34 వ్యక్తి.

నవంబర్ 21, 2021న స్థానిక పయనీర్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని కరప్ట్ ప్రాక్టీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ) ఒక ప్రకటనలో తెలిపింది.

దీనిపై సమాచారం అందుకున్న సీనియర్ స్టాఫ్ సార్జెంట్ మొహమ్మద్ అజార్, సార్జెంట్ ఫిర్హాన్ అబ్దుల్ రషీద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా తాను మద్యం సేవించినట్లు సార్జంట్ ఫిర్హాన్‌కి కృష్ణ తెలిపాడు.ఈ సందర్భంగా ఫిర్హాన్‌కి 50 సింగపూర్ డాలర్ల నోటును ఇచ్చి ‘‘దయచేసి సహాయం చేయమని’’ కోరినట్లు ఛానెల్ న్యూస్ ఆసియా నివేదించింది.

అయితే అధికారులు మాత్రం అతనిని ప్రశ్నించారు.ఈ సందర్భంగా నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో కృష్ణ విఫలమయ్యాడు.సార్జంట్ ఫిర్హాన్ ఈ కేసును వ్యక్తిగతంగా దర్యాప్తు జరిపి కృష్ణను అరెస్ట్ చేశారు.

Telugu Cpiib, Seniorstaff, Sergeantfirhan, Singapore, Singaporejails-Telugu NRI

విచారణలో కృష్ణ తన బ్యాగ్ నుంచి 50 సింగపూర్ డాలర్ల నోటును తీసి.ట్రాఫిక్ నేరాలకు సంబంధించి తనపై ఎలాంటి దర్యాప్తును చేయకుండా వుండేందుకు ఫిర్హాన్‌కు లంచంగా అందించాడని, కానీ ఫిర్హాన్ అందుకు నిరాకరించినట్లు సీపీఐబీ వెల్లడించింది.ఈ నేరాలకు సంబంధించి ఫిబ్రవరి 16న కోర్టులో అవినీతి ఆరోపణలు వచ్చాయి.

తాగి డ్రైవింగ్ చేసినందుకు కృష్ణను దోషిగా తేల్చిన కోర్టు శిక్ష విధించింది.అవినీతి పట్ల సింగపూర్ కఠినమైన జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తోందని సీపీఐబీ స్పష్టం చేసింది.

అవినీతి నేరానికి పాల్పడిన ఎవరికైనా లక్ష సింగపూర్ డాలర్ల జరిమానా, ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube