తమిళ బ్యూటీ శృతి హాసన్ కోలీవుడ్‌లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తెలుగులో కూడా తనకంటూ మంచి క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది.ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రాల్లో గబ్బర్‌సింగ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ఈ హీరోయిన్‌కు అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది.
అయితే తన పర్సనల్ లైఫ్ గురించి సినిమాలకు ఈ మధ్య బ్రేక్ ఇచ్చిన శృతి ఇప్పుడు మళ్లీ తిరిగి సినిమాల్లో ఫుల్ బిజీగా మారింది.ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగులో ఒకట్రెండు చిత్రాల్లో హీరోయిన్గా దుమ్ములేపేందుకు రెడీ అయ్యింది ఈ బ్యూటీ.
కాగా తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ ఫోటో ట్రెండింగ్‌గా మారింది.గోవా బీచ్‌లో తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ బికీనీలో అమ్మడు వేడిసెగలు పుట్టిస్తోంది.
అయితే ఈ ఫోటోలో శృతి ఓ లుంగీ కట్టుకుని కనిపించింది.ఈ లుంగీని తాను దొంగతనం చేశానంటూ చెప్పుకొచ్చింది.
నిర్మాత, రచయిత ర్యాన్ ఇవాన్ స్టీఫెన్‌కు చెందిన లుంగీని తాను దొంగలించి వాడుతున్నట్లు శృతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో చెప్పుకొచ్చింది.ఇక బికినీ వేర్లో శృతి అదిరిపోయిందని ఆమె అభిమానులు అంటున్నారు.
అయితే ప్రస్తుతం ఆమె నటిస్తున్న క్రాక్ చిత్ర షూటింగ్‌ను గోవాలో జరుపుకుంటోంది చిత్ర యూనిట్.
అక్కడ రవితేజ-శృతి హాసన్‌లపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.
ఈ క్రమంలోనే గోవా బీచ్‌లో శృతి అందాల విందు చేసిందని తెలుస్తోంది.ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా బి.మధు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి.
మరి ఈ సినిమాతో శృతి హాసన్ టాలీవుడ్లో మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.