ఆర్ఆర్ఆర్ సినిమాకు అసలు నిర్మాత చిరంజీవా.. క్లారిటీ ఇదేనంటూ?

టాలీవుడ్( Tollywood ) ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దానయ్య మెగా హీరోలతో ఎక్కువగా సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే.ఈ రీజన్ వల్ల మెగా ఫ్యామిలీకి దానయ్య బినామీ అంటూ వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

 Shocking Facts About Rrr Movie Producer Details Here Goes Viral In Social Media-TeluguStop.com

ఆర్.ఆర్.ఆర్( RRR ) సినిమాకు అసలు నిర్మాత చరణ్ అని కొంతమంది ప్రచారం చేస్తే మరి కొందరు చిరంజీవి అని ప్రచారం చేశారు.అయితే ఈ వార్తల గురించి తాజాగా దానయ్య క్లారిటీ ఇచ్చారు.

ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో డీవీవీ దానయ్య( DVV Danayya ) కనిపించలేదనే సంగతి తెలిసిందే.అయితే వేర్వేరు రూమర్లు ప్రచారంలోకి వస్తుండటంతో దానయ్య ఆ కామెంట్ల గురించి స్పందించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

నేను పబ్లిసిటీకి కొంచెం దూరంగా ఉంటానని దానయ్య అన్నారు.మన సినిమాలు మాట్లాడాలని నేను భావిస్తానని ఆయన పేర్కొన్నారు.2006లో జక్కన్నకు స్మాల్ అడ్వాన్స్ ఇచ్చానని దానయ్య తెలిపారు.

మర్యాదరామన్న సినిమాకు నిర్మాతగా రాజమౌళి అవకాశం ఇవ్వగా పెద్ద సినిమా చేస్తానని నేను చెప్పానని దానయ్య అన్నారు.రాజమౌళి గారికి నేను రుణపడి ఉంటానని దానయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు.రాజమౌళి ( Rajamouli )మాటపై ఉండే మనిషి అని ఆయన చెప్పుకొచ్చారు.

ఆర్.ఆర్.ఆర్ రూపంలో నా ఎదురుచూపులకు ఫలితం దక్కిందని దానయ్య అన్నారు.నేను డౌన్ ట్ ఎర్త్ ఉంటానని దానయ్య తెలిపారు.

పబ్లిసిటీ ఇష్టం లేదు కాబట్టే ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ ఫంక్షన్ కు నేను వెళ్లలేదని ఆయన పేర్కొన్నారు.ఆర్.ఆర్.ఆర్ ను వదిలేసుకుంటే 100 కోట్లు ఇస్తామని ఇతర నిర్మాతలు చెప్పారని వచ్చిన కామెంట్ల విషయంలో నిజం లేదని దానయ్య వెల్లడించారు.ఆర్.ఆర్.ఆర్ లో చిరంజీవి( Chiranjeevi ) పార్ట్నర్ అనే వార్తల్లో నిజం లేదని నేను ఫైనాన్షియర్లపై ఆధారపడి సినిమాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.చిరంజీవి ఆర్.ఆర్.ఆర్ కు ప్రొడ్యూసర్ అనే వార్తను ఖండిస్తున్నానని దానయ్య తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube