ఆరెంజ్ మూవీ టైటిల్ వెనుక ఇంత కథ ఉందా.. రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

రామ్ చరణ్( Ram Charan ) బొమ్మరిల్లు భాస్కర్ ( Bommarillu Bhaskar )కాంబినేషన్ లో తెరకెక్కిన ఆరెంజ్ మూవీ ( Orange Movie )డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాకు నాగబాబు ( Naga Babu )నిర్మాత కాగా నిర్మాతగా నాగబాబుకు ఈ సినిమా కోలుకోలేని స్థాయిలో నష్టాలను మిగిల్చింది.

 Shocking Facts About Orange Movie Title Details Here Goes Viral , Orange Movie-TeluguStop.com

అయితే ఈ సినిమాను చూసిన చాలామంది ప్రేక్షకులు ఈ మూవీ టైటిల్ విషయంలో నెగిటివ్ కామెంట్లు చేశారు.ఈ సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా ఒక సందర్భంలో ఈ సినిమా టైటిల్ కు సంబంధించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.ఎక్కువ సమయం థింక్ చేసి లోతుగా ఆలోచించి బొమ్మరిల్లు భాస్కర్ ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మూవీ థీమ్ కు అనుగుణంగా ఆ టైటిల్ ను పెట్టామని ఆరెంజ్ మూవీ కాన్సెప్ట్ ప్రకారం ప్రేమ కొంతకాలం తర్వాత తగ్గుతుందని బొమ్మరిల్లు భాస్కర్ అన్నారు.

రిలేషన్ షిప్ లో ఉండే ఎత్తుపల్లాలను సన్ రైజ్, సన్ సెట్ తో పోల్చడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.సన్ రైజ్ సమయంలో సన్ సెట్ సమయంలో సూర్యుడు ఆరెంజ్ కలర్ లో ఉంటాడని బొమ్మరిల్లు భాస్కర్ పేర్కొన్నారు.సూర్యోదయం ప్రేమ పుట్టడాన్ని సూర్యాస్తమయం ప్రేమ ముగియడాన్ని సూచిస్తుందని ఆయన కామెంట్లు చేశారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్( Most Eligible Bachelor ) తో హిట్ అందుకున్న ఈ దర్శకుని చేతిలో సరైన సినిమా లేదు.

బొమ్మరిల్లు భాస్కర్ కు కొత్త అవకాశాలు వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బొమ్మరిల్లు భాస్కర్ కు ఛాన్స్ ఇచ్చేదెవరో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలకు యూత్ లో మంచి డిమాండ్ ఉంది.

బొమ్మరిల్లు భాస్కర్ కు స్టార్ హీరోలు ఎవరూ ఛాన్స్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube