గాడ్ ఫాదర్ లో చిరంజీవి తండ్రిగా నటించింది ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.గాడ్ ఫాదర్ మూవీ మరికొన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు భారీ లాభాలను అందించడం గమనార్హం.

 Shocking Facts About God Father Movie Details Here Goes Viral , God Father, Sarv-TeluguStop.com

ఈ సినిమా సక్సెస్ సాధించడానికి సినిమాలో బ్రహ్మ తండ్రి పాత్ర పోషించిన నటుడు కూడా కారణమనే సంగతి తెలిసిందే.చిరంజీవి తండ్రి పాత్రలో నటించి మెప్పించిన ఈ నటుడి పేరు సర్వదమన్ బెనర్జీ కావడం గమనార్హం.

సిరివెన్నెల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు గాడ్ ఫాదర్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ప్రేక్షకులను మెప్పించారు.కలకత్తా వాసి అయిన ఈ నటుడు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొంది నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

 Shocking Facts About God Father Movie Details Here Goes Viral , God Father, Sarv-TeluguStop.com

కన్నడలో తెరకెక్కిన ఆది శంకరాచార్య సినిమాతో నటుడిగా సర్వదమన్ బెనర్జీ కెరీర్ మొదలైంది.తొలి తెలుగు సినిమాతోనే నంది అవార్డ్ గెలుచుకున్నాడంటే ఈ నటుడు ఎంత ప్రతిభ ఉన్న నటుడో సులభంగానే అర్థమవుతుంది.

కన్నడ, తెలుగు భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా సర్వదమన్ బెనర్జీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.గాడ్ ఫాదర్ సక్సెస్ తో ఈ నటుడికి సినిమా ఆఫర్లు పెరుగుతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.సిరివెన్నెల సినిమాలో అంధునిగా నటించిన నటుడే 35 ఏళ్ల తర్వాత గాడ్ ఫాదర్ లో నటించారని తెలిసి మరి కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సర్వదమన్ బెనర్జీ గురించి, ఆయన నటన గురించి కొందరు క్రిటిక్స్ సైతం తమ రివ్యూలలో ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.

సర్వదమన్ బెనర్జీ కొత్త సినిమా ఆఫర్ల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.ఈ నటుడు మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube