టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలతో పాటు ఇతర భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో అశిష్ విద్యార్థి ఒకరు.విలన్ రోల్స్ లో, కామెడీ రోల్స్ లో ఎక్కువగా నటించిన అశిష్ విద్యార్థి( ashish vidyarthi ) తన నటనతో ఎన్నో భారీ విజయాలను ఖాతాలో వేసుకున్నారు.
అయితే అశిష్ విద్యార్థి తాజాగా రెండో పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.అశిష్ విద్యార్థి పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు రూపాలి బారువ కాగా ఈమె ఎవరనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
రూపాలి బారువా ( Rupali Barua )స్వస్థలం గౌహతి( Guwahati ) అని సమాచారం అందుతోంది.ఈమెకు సొంతంగా ఫ్యాషన్ స్టోర్ ఉందని ఆ ఫ్యాషన్ స్టోర్ కోల్ కతాలో ఉందని బోగట్టా.
రూపాలి బారువా వయస్సు ప్రస్తుతం 50 సంవత్సరాలు అని సమాచారం అందుతోంది.రూపాలి బారువాకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఫ్యాషన్ డిజైనర్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా రూపాలికి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

అశిష్ తన వ్లాగ్స్ లో భాగంగా ఒకసారి రూపాలిని కలవడం జరిగిందని ఆ సమయంలో ఫోన్ నంబర్లను మార్చుకోవడం జరిగిందని సమాచారం అందుతోంది.అశిష్ విద్యార్థి కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా ప్లాన్ చేసుకుంటున్నారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.
రాబోయే రోజుల్లో కూడా అశిష్ విద్యార్థికి మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు భావిస్తున్నారు.