తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం కలెక్టరేట్లను ప్రారంభించనుంది.ఈ మేరకు వచ్చే నెల మరో నాలుగు కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఇందులో భాగంగా జూన్ 4వ తేదీన నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభించనున్నారు.6వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్, 9వ తేదీన మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ తో పాటు జూన్ 12న గద్వాల జిల్లా కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభిస్తారని తెలుస్తోంది.







