పవన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శివాజీ.. జగన్ పవన్ మధ్య తేడా ఇదేనంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటుడు శివాజీ( Shivaji ) ఈ మధ్య కాలంలో కొంతకాలం పాటు సైలెంట్ అయినా ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవుతున్నారు.తాజాగా శివాజీ జగన్ గురించి, పవన్ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

 Shivaji Shocking Comments About Pawan Kalyan Details Here Goes Viral In Social M-TeluguStop.com

పవన్ శివాజీ కాంబినేషన్ లో పలు సినిమాలు సైతం వచ్చాయనే సంగతి తెలిసిందే.శివాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒక శక్తి అని అన్నారు.

తనకు ఎవరితో గొడవలు లేని ఆయన తెలిపారు.తాను సమాజం బాగుండాలని భావిస్తానని ఆయన తెలిపారు.ప్రముఖ రాజకీయ నేతలను విమర్శించాలని తాను ఎప్పుడూ అనుకోనని ఆయన చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ ( Janasena party )గోదావరి జిల్లాలలో అద్భుతాలు చేయగలదని శివాజీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జనసేనకు ఉండే ఓటు బ్యాంక్ ఆ పార్టీకి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని శివాజీ తెలిపారు.

పవన్ చేయాలని అనుకుంటే ఏదైనా జరుగుతుందని శివాజీ చెప్పుకొచ్చారు.కానీ పవన్ అనుకోడని ఆయన ఎందుకు అనుకోడో కూడా నాకు అర్థం కాదని శివాజీ తెలిపారు.పవన్ చేసే పోరాటాలకు మద్దతు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.పవన్ దగ్గర అస్త్రాలు ఉన్నాయని వాటిని సరైన సమయంలో సంధించడం లేదని ఆయన కామెంట్లు చేశారు.

సీఎం జగన్ ( CM Jagan )ఫోకస్ ఉన్న రాజకీయనేత అని జగన్ ఫోకస్ పెట్టి వైసీపీని అధికారంలోకి తెచ్చారని శివాజీ చెప్పుకొచ్చారు.పవన్ మాత్రం ఫోకస్ పెట్టడం లేదని పవన్ కళ్యాణ్, జగన్ మధ్య తేడా ఇదేనని ఆయన కామెంట్లు చేశారు.పవన్ లో ఇంకా ఏదో ఉందని అది తెలుసుకున్న రోజున ఆయన సీఎం అవుతారని శివాజీ అభిప్రాయపడ్డారు.పవన్ అనుకుంటే అయిపోతుందని శివాజీ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube