కృష్ణా నీళ్ల జ‌గ‌డంపై ష‌ర్మిల ఆలోచ‌నాత్మ‌క కామెంట్స్‌.. విమ‌ర్శ‌ల‌కు చెక్‌!

తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య మొన్న‌టి వ‌ర‌కు కృష్ణా నీళ్ల పంచాయితీ తారా స్థాయిలో జ‌రిగింది.అయితే దీనిపై వైఎస్ ష‌ర్మిల ఎలాంటి కామెంట్లు చేయ‌లేక స‌త‌మ‌త మ‌యింద‌నే చెప్పొచ్చు.

 Sharmila's Thought-provoking Comments On Krishna's Watershed Check Out The Revie-TeluguStop.com

ఆమె కామెంట్లు చేయ‌క‌పోవ‌డంతో అంతా ఆమె ప‌ని అయిపోయింద‌ని ఒక్క దెబ్బ‌తో టీఆర్ ఎస్ అధిష్టానం ఆమె పార్టీ పెట్ట‌క‌ముందే దెబ్బ కొట్టేశార‌ని కామెంట్లు వ‌చ్చాయి.ఇక దీనిపైనా ష‌ర్మిల కానీ ఆమె అభిమానులు గానీ ఎలాంటి స్పంద‌న చేయ‌లేదు.

కానీ ఆమె ఈరోజు ఆలోచ‌నాత్మ‌క‌మైన కామెంట్లు చేశారు.

ఈ రోజు ఆమె త‌న పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా ఎన్నో కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ప‌నిలో ప‌నిగా త‌న పార్టీ వైఖ‌రిని కూడా చెప్పారు.తాను కృష్ణా, గోదావ‌రి న‌దుల నుంచి తెలంగాణ‌కు రావాల్సిన ఒక్క బొట్టును కూడా వ‌దిలిపెట్ట‌న‌ని, అలాగే ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లాల్సిన వాటిని కూడా అడ్డుకోబోన‌ని తెలిపింది.

ఈ మాట‌లు చూస్తుంటే ఇటు తెలంగాణ సెంటిమెంట్‌ను దెబ్బ తీయ‌కుండా అటు ఏపీ మ‌నోభావాల‌ను కూడా నొప్పించ‌కుండా చాలా ఆలోచ‌నాత్మ‌కంగా మాట్లాడార‌ని తెలుస్తోంది.

Telugu Congress, Godavari, Krishna, Sharmila-Telugu Political News

అలాగే అటు ఏపీలో కూడా త‌న చ‌రిష్మా త‌గ్గ‌కుండా అన్న పార్టీకి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చూసుకుంద‌ని తెలుస్తోంది.ఇక ఇప్పుడు ఆమె మాట‌ల‌తో కాంగ్రెస్‌కు గానీ టీఆర్ ఎస్‌కు గానీ ఎలాంటి విమ‌ర్శ‌లు చేసేందుకు అవ‌కాశం లేకుండా చేసింది.అయితే ఆమె పూర్తిగా తెలంగాణ వైపే మాట్లాడి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆమె తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుకు ట్రై చేస్తుండ‌టంతో తెలంగాణ వైపు మాట్లాడితేనే బాగుండేద‌ని అంటున్నారు.కానీ ష‌ర్మిల మాత్రం ఒకే స‌మ‌యంలో ఏపీ తెలంగాణ‌లోని వైఎస్ అభిమానులు మెచ్చే విధంగా మాట్లాడి త‌న మార్కును క‌న‌బ‌రిచారు.

ఏదేమైనా ష‌ర్మిల కామెంట్లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాశంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube