తెల్ల జుట్టు ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.పూర్వం యాబై, అరవై ఏళ్లు దాటిన వారిలోనే తెల్ల జుట్టు సమస్య ఉండేది.
కానీ, నేటి కాలంలో మాత్రం యంగ్ ఏజ్‌లోనే ఈ సమస్య కనిపిస్తోంది.ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి.
ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, కాలుష్యం, ఒత్తిడి, పోషకాల లోపం, స్మోకింగ్ ఇలా అనేక కారణాల వల్ల తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.వయసు మీద పడక ముందే తెల్ల జుట్టు వస్తే వారి బాధ వర్ణణాతీతం.
అయితే తెల్ల జుట్టును నివారించడంలో నువ్వుల నూనె అద్భుతంగా సహాయపడుతుంది.సాధారణంగా నువ్వుల నూనెను అత్యధికంగా వంటలకు ఉపయోగిస్తారు.నువ్వుల విత్తనాల నుంచి తయారు చేసిన నువ్వుల నూనె కేశాలకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య ఉన్న వారు ఒక బౌల్ తీసుకుని నువ్వుల నూనె మరియు కొబ్బరి నూనె సమానంగా తీసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రించే ముందు తలకు పట్టించి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
అలాగే తెల్ల జుట్టు సమస్యనే కాదు మరిన్ని విధాలుగా కూడా నువ్వుల నూనె ఉపయోగపడుతుంది.నువ్వుల నూనెతో రెండు రోజలకు ఒకసారి తలకు మసాజ్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల డ్రైగా మరియు రఫ్‌గా ఉన్న హెయిర్ స్మూత్‌గా మారుతుంది.అలాగే నువ్వుల నూనెలో ఉండే విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు అంది ఒత్తుగా, నల్లగా ఎదిగేందుకు సహాయపడతాయి.
అదేవిధంగా, డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడంలో నువ్వుల నూనె అద్భుతంగా సహాయపడుతుంది.అందువల్ల, రెండు లేదా మూడు రోజులకు ఒకసారి నువ్వుల నూనెను జుట్టుకు బాగా పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేసేస్తే మంచి ఫలితం ఉంటుంది.