సత్యదేవ్ తమన్నా సినిమాలో సీనియర్ నటి.. ఎవరంటే?

ప్రస్తుతం రానున్న సినిమాలో సీనియర్ నటీనటులు బాగా నటిస్తున్నారు.చాలా వరకు సీనియర్ నటుల పాత్రలపై సినిమా కథ నడుస్తోంది.

మహేష్ బాబు నటించిన సినిమా లో సీనియర్ నటి విజయశాంతి నటించిన సంగతి తెలిసిందే.అంతే కాకుండా మరో స్టార్స్ సినిమాలలో కూడా సీనియర్ నటీనటుల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సత్యదేవ్, తమన్నా నటిస్తున్న సినిమాలో మరో సీనియర్ నటి నటిస్తున్నారు.ప్రస్తుతం నాగ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా గుర్తుందా శీతాకాలం.

ఈ సినిమాలు టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా నటీనటులుగా నటిస్తున్నారు.నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ మీద నాగ శేఖర్, భావన రవి, ఎంఎస్ రెడ్డి, చిన బాబు గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాలో మరో సీనియర్ నటి సుహాసిని ఓ కీలక పాత్రలో నటిస్తుంది.అంతేకాకుండా తాజాగా ఆమె ఓ ఫోటోను విడుదల చేయగా అందులో తమన్నా, సత్యదేవ్, సుహాసిని కలిసి దిగారు.

ఇక ఈ సినిమా టైటిల్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందించింది.మేఘ ఆకాష్, కావ్య శెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి కలుగగా.కన్నడ లో విడుదలైన సూపర్ హిట్ లవ్ మాక్ ట‌ేల్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఫిబ్రవరి 14న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయగా అందులో తమన్నా, సత్యదేవ్ ఒకరినొకరు రొమాంటిక్ గా చూసుకుంటూ చేతులు కలుపుకొని ఉండగా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందాయి.ఇక త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడానికి సిని బృందం సిద్ధంగా ఉన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు