ప్రస్తుత కాలంలో కొందరు పవిత్రమైనటువంటి విద్యా బోధన వృత్తి చేపట్టి ఆ ముసుగులో చేయకూడని పాపాలు చేస్తున్నారు.తాజాగా ఓ వ్యక్తి ఎంతో గౌరవ ప్రదమైనటువంటి ప్రిన్సిపాల్ హోదాలో ఉంటూ తమ వద్ద పని చేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులను సంరక్షించాల్సింది పోయి చివరికి మహిళా ఉపాధ్యాయురాలు పైనే అత్యాచారం చేసిన ఘటన దేశంలోని బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి నలంద జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలో ఓ వ్యక్తి ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.అయితే అదే పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు విద్యా బోధకురాలుగా బాధ్యతలు నిర్వహిస్తోంది.
దీంతో ప్రిన్సిపాల్ పై అధికారి కావడంతో మహిళా ఉపాధ్యాయురాలు అతడు చెప్పిన పనులను తూచా తప్పకుండా చేసేది.ఈ క్రమంలో ప్రిన్సిపాల్ ఏకంగా ఉపాధ్యాయురాలను తన ఇంటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇవ్వగా ఆ విషయం తెలియక సేవించినటువంటి ఉపాధ్యాయురాలు మత్తులోకి జారుకోగా ఆమె పై దారుణంగా అత్యాచారం చేశాడు.
అనంతరం వీడియోలు కూడా తీశాడు.అయితే మత్తు నుంచి మేల్కొన్నటువంటి ఉపాధ్యాయురాలు తనపై అత్యాచారం జరిగిన విషయం గ్రహించింది.
అలాగే ఈ విషయం గురించి ప్రిన్సిపాల్ ని నిలదీయడంతో ఈ విషయం గురించి బయటకు చెబితే ఈ వీడియోని అందరికీ చూపించి పరువు తీస్తానని బెదిరించ సాగాడు.
దీంతో భయపడినటువంటి ఉపాధ్యాయురాలు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసింది.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.