ఇద్దరినీ చితకొట్టి జైలుకెళ్ళింది.. వరలక్ష్మిపై శరత్ కుమార్ వైరల్ కామెంట్స్?

తెలుగు ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.

 Sarath Kumar Comments On Daughter Varalaxmi Sarathkumar Details, Sarath Kumar, V-TeluguStop.com

వరలక్ష్మి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేసి సినిమా క్రాక్.క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి భీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

క్రాక్ సినిమా తర్వాత వీర సింహారెడ్డి సినిమాలో భానుమతి క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే.

Telugu Kondraal Paavam, Krack, Sarath Kumar-Movie

రెండు సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయింది వరలక్ష్మి శరత్ కుమార్.గతంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన ఈమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ఎక్కువగా విలన్ క్యారెక్టర్లలో నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ కి సంబంధించిన ఒక విషయాన్ని తన తండ్రి శరత్ కుమార్ బయట పెట్టారు.నటి వరలక్ష్మి నటించిన తాజా తమిళ చిత్రం కొండ్రాల్ పావమ్.

మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవల ఈ సినిమా ఈవెంట్ లో భాగంగా నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ.

కూతురు వరలక్ష్మి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Telugu Kondraal Paavam, Krack, Sarath Kumar-Movie

ఇప్పుడు అందరూ వరలక్ష్మిని నటి విజయశాంతి అంటున్నారు.అది నిజమే.నా కూతురు సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు నేను ఇప్పుడు అవసరమా? అని అన్నాను.అయినా తాను సినిమాలు చేసి, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది.దీనికి హార్డ్ వర్కే కారణం.అంతేకాకుండా వరలక్ష్మి చాలా ధైర్యవంతురాలు.ఒక రోజు రాత్రి మీ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఉందని, ఇద్దరు కుర్రాళ్లను చితక్కొట్టిందని పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

నేను కంగారు పడ్డాను.కానీ ఆ కుర్రాళ్ళు అంతకుముందే ఆ యువకులు కార్ కు డ్యాష్ ఇచ్చారని తెలిసింది.

అందుకే వారిని చితకొట్టింది అని శరత్ కుమార్ తెలిపారు.కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక చాలామంది అభిమానులు ఆ వీడియోని చూసి వరలక్ష్మి శరత్ కుమార్ ధైర్యానికి మెచ్చుకుంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube