ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ నుంచి కొత్తగా మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ A25 5G స్మార్ట్ ఫోన్ ( Samsung Galaxy A25 5G smartphone )విడుదల కానుంది.ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు ఏమిటో చూద్దాం.ఈ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD+ సూపర్ ఆమోలెట్ ఇన్ఫినిటీ-U డిస్ ప్లే తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్ తో 1000 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది.
Exynos 1280 అక్టా ప్రాసెసర్( Exynos 1280 octa processor ) తో ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతో ఉంటుంది.ఈ కెమెరా ప్రత్యేకంగా OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ తో ఉంటుంది.8MP అల్ట్రా వైడ్ సెన్సర్, 2MP మ్యాక్రో లెన్స్ ను కలిగి ఉంది.సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13MP కెమెరాను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM+256GB స్టోరేజ్ తో ఉంటుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత oneUI ఆధారంగా పని చేస్తుంది.మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా స్టోరేజ్ ను 1TB వరకు పెంచుకోవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, ఎల్లో, లైట్ బ్లూ, బ్లూ షేడ్, బ్లూ కలర్ లలో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ పై 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్లు సహా కొన్ని సంవత్సరాల పాటు OS అప్డేట్లను అందించనుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.బేస్ వేరియంట్ రూ.27 వేలు, టాప్ ఎండ్ వేరియంట్ రూ.35000 వరకు ఉంటుంది.