సమంత ప్రధాన పాత్రలో హరి హరీష్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా యశోద.శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సరోగసి నేపథ్యంతో వస్తుంది.
ఈ సినిమాలో సమంత నటన అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది.సినిమాలో సమంత యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టేసింది.
నవంబర్ 11న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా బడ్జెట్ చాలా పెట్టేసినట్టు సమాచారం.సినిమాకు ముందు పాతిక కోట్ల బడ్జెట్ అనుకుంటే అది కాస్త మరో 10 కోట్లు ఎక్కువ అయ్యిందని.
మొత్తం 35 కోట్ల దాకా యశోద సినిమాకు ఖర్చు పెట్టినట్టు టాక్.
యశోద సినిమాలో సమంత మరోసారి తన నట విశ్వరూపం చూపిస్తుందని అర్ధమవుతుంది.
ఓ పక్క సమంత మయోసైటిస్ తో బాధపడుతున్నా సరే యశోద సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగినట్టు తెలుస్తుంది.
మరి సమంత మీద పెట్టుకున్న ఆశలు నిలబెడుతుందా లేదా అన్నది చూడాలి.ఇదివరకు సమంత లీడ్ రోల్ లో చేసిన ఓ బేబీ, యూటర్న్ సినిమాలు సక్సెస్ అవడంతో ఈ సినిమాపై కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.