మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్.ఆర్.
ఆర్ తర్వాత తన క్రేజీ ప్రాజెక్ట్ లతో మెగా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు.ఇప్పటికే శంకర్ తో ఆర్సీ 15వ సినిమా భారీ రేంజ్ లో రాబోతుందని తెలుస్తుండగా లేటెస్ట్ గా చరణ్ కోసం మరో క్రేజీ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.
మైత్రి మూవీ మేకర్స్, యువి క్రియేషన్స్ కలిసి ఈసారి చరణ్ సినిమా చేయాలని అనుకుంటున్నారట.యువి క్రియేషన్ దగ్గర చరణ్ డేట్స్ ఉన్నాయి.అందుకే ఆ ప్రాజెక్ట్ కి మైత్రి వారు కూడా కలుస్తున్నారట.
ఈ క్రేజీ కాంబోలో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకి డైరక్టర్ గా సుకుమార్ పేరు వినిపిస్తుంది.ఆల్రెడీ సుకుమార్ తో రంగస్థలం లాంటి సూపర్ హిట్ అందుకున్న చరణ్ ఈసారి మరింత స్ట్రాంగ్ మూవీతో రాబోతున్నట్టు తెలుస్తుంది.
పుష్ప 1 తో పాన్ ఇండియా రేంజ్ లో డైరక్టర్ గా తన సత్తా చాటిన సుకుమార్ చరణ్ తో అంతకుమించి అనిపించే మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.రాం చరణ్ సినిమాల లైనప్ చూస్తుంటే ప్రభాస్ తరహాలో పాన్ ఇండియా వైడ్ భారీ ప్లాన్ లోనే ఉన్నట్టు అర్ధమవుతుంది.