సమంత ప్రస్తుతం శాకుంతలం( Shaakunthalam ) సినిమా ప్రమోషన్ కార్యకరమాల్లో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.సమంత( Samantha ) గత కొద్దిరోజులుగా మయూసైటిసిస్ వ్యాధితో బాధపడుతూ పూర్తిగా తాను కమిట్ అయిన సినిమాలకు దూరంగా ఉంటూ చికిత్స తీసుకుంటూ వచ్చారు.
అయితే ఈమె ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకున్నారని తెలుస్తుంది.ఇలా ఈ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత తిరిగి తన సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండడమే కాకుండా శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంతకు తన ఆరోగ్యం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ప్రస్తుతం సమంత తన ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అనే విషయాల గురించి వెల్లడించారు.ఇలా సుమ( Suma ) తన ఆరోగ్యం గురించి ఆరా తీయగా సమంత సమాధానం చెబుతూ.గతంతో పోలిస్తే ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు.యశోద( Yashoda ) సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు తాను చాలా వీక్ గా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం తాను కోలుకొని మెల్లిగా బయటకు రాగలుగుతున్నానని ఇలా ఈ వ్యాధి నుంచి బయటపడి శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా అనిపిస్తోందంటూ ఈ సందర్భంగా సమంత తన ఆరోగ్యం గురించి స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ప్రస్తుతం తన పరిస్థితి బాగుందని సమంత తెలియచేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈమె ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి( Kushi ) సినిమాలో నటిస్తున్నారు.
అలాగే సిటాడెల్ అనే సిరీస్ లో కూడా నటిస్తున్నారు.