సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.పుష్ప సినిమా ఐటెం సాంగ్ తర్వాత సామ్ పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో అప్పటి నుండో ఈమె మెల్ల మెల్లగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం పాగా వేసేందుకు సిద్ధం అయ్యింది.విడాకుల తర్వాత మరింత స్పీడ్ గా కెరీర్ ను గ్రో అప్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది.
ఆ మధ్య ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ చేసి బాలీవుడ్ లో సైతం రాజీ పాత్రకు మంచి ప్రశంసలు దక్కించుకుని అక్కడ బాగా పాపులర్ అయ్యింది.ఇక అప్పటి నుండి ఈమెపై హిందీ వాళ్ళు కూడా ఫోకస్ పెట్టి అవకాశాలు ఇచ్చారు.
ఈ క్రమంలోనే సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లతో కూడా సామ్ హిందీలో బిజీగా మారింది.మరి ఈమె బాలీవుడ్ లో పాపులర్ అయిన క్రమంలోనే ఒక అరుదైన అవకాశాన్ని అందుకుంది.
డబూ రత్నానీ క్యాలెండర్ పై కనిపించే ఛాన్స్ అందుకుంది.ఇంత వరకు సౌత్ లో ఏ ముద్దు గుమ్మ కూడా ఈ అవకాశాన్ని అందుకోలేదు.కేవలం బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే ఈ అవకాశాన్ని దక్కించుకోగా ఇప్పుడు సామ్ మొదటి సారి ఈ అవకాశాన్ని అందుకుంది.బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ పాపులర్ అవ్వడం వల్లనే ఈమెకు ఈ ఛాన్స్ వచ్చింది అని బాలీవుడ్ మీడియా చెబుతుంది.
మరి డబూ రత్నానీ ఫోటో షూట్ కోసం సమంత ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.బాలీవుడ్ ప్రాజెక్ట్ సీటాడెల్ సిరీస్ లో ఈమె నటిస్తుంది.ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే లు డైరెక్టర్ చేస్తున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అలాగే తెలుగులో సామ్ నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.