ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో వాటికి ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిని ఖరారు చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.చోడవరం నియోజకవర్గానికి చెందిన వేపాడ చిరంజీవరావును అధిష్టానం ప్రకటించింది.
ఏపీలో మార్చి 29న ముగ్గురు పట్టభద్రుల కాలం ముగియనున్న సంగతి తెలిసిందే.అటు వైసీపీ, పీడీఎణ్ తో పాటు బీజేపీ ఎమ్మెల్సీల పదవీకాలం సైతం ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహించనున్నారు.