ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అయితే ప్రశాంత్ నీల్ సలార్ సినిమా టైటిల్ ను ప్రకటించిన తరువాత ఆ సినిమా టైటిల్ చాలామందికి అర్థం కాలేదు.అయితే ప్రశాంత్ నీల్ సలార్ అనేది ఉర్దూ పదమని.
సమర్థవంతమైన నాయకుడు అనే అర్థం వస్తుందని చెప్పారు.
అయితే గూగుల్ లో మాత్రం “salaar” అని ఇంగ్లీష్ లో ఎంటర్ చేయగా తెలుగులో వస్తున్న అర్థం నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది.
తెలుగులో సలార్ కు పాలకూర అని అర్థం వస్తోంది.ప్రభాస్ ఫ్యాన్స్ కొందరు ఈ విషయం తెలిసి పాలకూర ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు.
మరి కొందరు నెటిజన్లు మాత్రం సలార్ అంటే పాలకూర అని కూడా అర్థం వస్తుందా.? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సలార్ అంటే ప్రశాంత్ నీల్ చెప్పిన అర్థమే సరైందని చెబుతున్నారు.
సలార్ మూవీ షూటింగ్ ప్రస్తుతం సింగరేణిలో జరగనుంది.ఈ ప్రాంతంలో ఫైట్ సీన్లను తెరకెక్కించనున్నారని సమాచారం.ప్రస్తుతం ఇక్కడ సెట్టింగ్ పనులు జరగనుండగా సెట్ పూర్తైన తరువాత ప్రభాస్ షూటింగ్ లో పాల్గొననున్నారు.
ఓపెన్ కాస్ట్ గనిలో ఏకంగా పది రోజుల పాటు షూటింగ్ జరపనున్నారని సమాచారం.సింగరేణి అతిథి గృహాలలో చితృ బృందం స్టే చేయనుందని తెలుస్తోంది.
హోంబలే ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.ప్రభాస్ ఈ సినిమాలతో పాటు ఆది పురుష్, రాధేశ్యామ్ సినిమాలలో నటిస్తున్నారు.
ఈ ఏడాదే సలార్ సినిమా విడుదల కానుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.