రొమాంటిక్ సీన్ల విషయంలో ఒక్కో హీరోయిన్ అభిప్రాయం ఒక్కో విధంగా ఉంటుంది.ఎక్కువమంది హీరోయిన్లు రొమాంటిక్ సీన్లు అంటే ఇబ్బందిగా ఫీలవుతారు.
రొమాంటిక్ సీన్లలో నటించడం కంఫర్టబుల్ గా ఉండదని హీరోయిన్లు మెజారిటీ సందర్భాల్లో అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో ఒకరైన సైరా భాను( Saira bhanu ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈ హీరోయిన్ హేరా ఫేరీ అనే బ్లాక్ బస్టర్ హిట్ లో నటించింది.అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా ఈ సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలై 47 సంవత్సరాలు కావడం గమనార్హం.
తాజాగా సైరా భాను ఆ రోజులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.హేరా ఫేరి చేయడం చాలా సంతోషంగా ఉందని అమితాబ్, వినోద ఖన్నా( Vinod Khanna ) కూడా నటించారని ఆమె అన్నారు.
డైరెక్టర్ ప్రకాష్ మెహ్రా మా ముగ్గురికీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడని ఆమె తెలిపారు.
ఆ సమయంలో మేము సినిమాలోని సన్నివేశాలను ఫన్నీగా మార్చేశామని సైరా అన్నారు.ఆ సినిమాలోని రొమాంటిక్ సీన్లు అంటే ఇప్పటికీ ఇష్టం అని సైరా భాను చెప్పుకొచ్చారు.ఆ సినిమాలోని సీన్స్ ఇప్పటికీ ఆనందాన్ని కలిగిస్తాయని సైరా భాను అన్నారు.
ఈ సినిమాను చూడని ప్రేక్షకులు ఉంటే చూసి ఆనందించాలని ఆమె కోరారు.సైరా భాను చేసిన ఈ పోస్ట్ కు దాదాపుగా 3000 లైక్స్ వచ్చాయి.
ఫేరా ఫేరి మూవీ 1976 సంవత్సరంలో విడుదలైంది.ఈ సినిమా కామెడీ మూవీ కాగా ప్రకాశ్ మెహ్రా( Prakash Mehra ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరిగే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ ఏడాది జులై నెల 7వ తేదీన సైరా భాను సోషల్ మీడియాలో అడుగు పెట్టారు.