Sai Pallavi : సాయి పల్లవిని అర్థం చేసుకోవడం మావల్ల కావట్లేదు అంటున్న స్టార్ నిర్మాతలు

ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి వ్యవహారం ఏ మాత్రం అర్థం కావడం లేదంటూ ఆమె అభిమానులు మరియు నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఒక్కొక్క సినిమా కు మూడు నుండి ఐదు కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధం గా ఉన్నా సాయి పల్లవి మాత్రం కమిట్ అయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు.

 Sai Pallavi Not Doing Films This Days , Sai Pallavi, Sai Pallavi Films, Fida Mo-TeluguStop.com

ఇలాంటి హీరోయిన్స్ కూడా ఉంటారా అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో సాయి పల్లవి గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.

ఈ మధ్య కాలం లో సాయి పల్లవి అస్సలు సినిమా లకు కమిట్ అయింది లేదు.కెరియర్ జోరు సమయం లోనే సినిమా లకు కమిట్ అవ్వాల్సి ఉంటుంది.

కానీ సాయి పల్లవి మాత్రం ఇప్పటి వరకు సినిమా లకు కమిట్‌ అవ్వక పోవడం ను ఏ ఒక్కరు అర్థం చేసుకోలేక పోతున్నారు.ఒక సీనియర్ నిర్మాత మీడియా తో మాట్లాడుతూ తన పాతిక సంవత్సరాల సినీ కెరియర్ లో ఎంతో మంది హీరోయిన్స్ ని చూశాను.

కానీ ఇలాంటి హీరోయిన్ ని చూడ లేదు.సాయి పల్లవి ని అర్థం చేసుకోవడం మా వల్ల కావడం లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు.

Telugu Fida, Sai Pallavi-Movie

తాను నిర్మిస్తున్న స్టార్ హీరో సినిమా లో సాయి పల్లవి ని హీరోయిన్ గా నటింపజేసేందుకు ఆయన ప్రయత్నించాడట.కానీ ఆయన ప్రపోజల్ ని సాయి పల్లవి సున్నితం గా తిరస్కరించిందని ఆయన పేర్కొన్నాడు.పారితోషికం విషయం లో ఎంతగా ప్రభావితం చేయాలని చూసినా ఆమె మాత్రం పెద్ద గా ఆసక్తి చూపించడం లేదు.అందుకు కారణం ఏమై ఉంటుందో అర్థం కావడం లేదని ఆ నిర్మాత పేర్కొన్నాడు.

అసలు సాయి పల్లవి ముందు ముందు సినిమా లు చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలని అంతా అంటూ ఉంటారు.కానీ సాయి పల్లవి మాత్రం అలా చేయడం లేదు.కారణం ఏంటో తెలియడం లేదు, సాయి పల్లవి ఒక వేళ వరుసగా సినిమా లకు కమిట్ అయితే ఏడాదికి అర డజను సినిమా లు ఆమె ఖాతా లో పడతాయి.

ఆమె ప్రతిభ అలాంటిది, కానీ ఆమె తన ప్రతిభ ను వినియోగించుకోవాలని భావించడం లేదనుకుంటా.అందుకే ఇలా పెద్ద గా సినిమా లు చేయకుండా నిర్మాతలకు చిరాకు పెడుతోందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube