మంచు మనోజ్ కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.భిన్నమైన కథలను ఎంచుకునే ఈ హీరో ఆ సినిమాలతో పలు సందర్బాలలో విజయాలను సొంతం చేసుకుంటే మరికొన్ని సందర్భాల్లో ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నారు.
ప్రస్తుతం మంచు మనోజ్ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.చాలా సందర్భాల్లో రెండో పెళ్లి వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చిన మనోజ్ భూమా మౌనికతో రెండో పెళ్లి వార్తలను మాత్రం పూర్తిస్థాయిలో ఖండించలేదు.
మరోవైపు వీళ్లిద్దరూ కలిసే ఉంటున్నారంటూ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.మనోజ్ స్నేహితుడు గణపతి మండపానికి ఆహ్వానించడంతో కొన్నిరోజుల క్రితం వీళ్లిద్దరూ కలిసి హాజరయ్యారని సమాచారం అందుతోంది.
మౌనికకు ఇప్పటికే మొదటి భర్త నుంచి విడాకులు మంజూరయ్యాయని ఆమె మనోజ్ తో కలిసే ఉంటున్నారని తెలుస్తోంది.
కొంతకాలం సైలెంట్ గా ఉండి ఆ తర్వాత వివాహ తేదీని ప్రకటించాలని మనోజ్ మౌనిక భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
చాలా సంవత్సరాల నుంచి మనోజ్ మౌనికలకు ఒకరితో ఒకరికి పరిచయం ఉందని బోగట్టా.గతంలోనే మనోజ్ మౌనికల పెళ్లి గురించి చర్చలు జరిగాయని మనోజ్ మొదటి పెళ్లి మౌనికతోనే చెయ్యాలని అనుకున్నారని సమాచారం అందుతోంది.
అయితే కులాలు వేరనే ఒకే ఒక్క కారణం వల్ల ఈ నిర్ణయం విషయంలో వెనుకడుగు వేశారని బోగట్టా.
ఆ తర్వాత కూడా కులాలు వేరు అయినప్పటికీ మనోజ్ ప్రణతి అనే యువతిని వివాహం చేసుకున్నారు.మనోజ్ మౌనికల వివాహానికి సంబంధించిన శుభవార్త త్వరలోనే వెల్లడి కానుంది.మనోజ్ మౌనికల జోడీకి నెటిజన్ల నుంచి సైతం ప్రశంసలు దక్కుతున్నాయి.
కలకాలం ఈ జోడీ అన్యోన్యంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మనోజ్ త్వరలో మౌనికతో పెళ్లి గురించి అధికారికంగా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.