పవర్ స్టార్ - సురేందర్ రెడ్డి మూవీ ఉందా ఆగిపోయిందా.. క్లారిటీ ఇదే!

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి( Director Surender Reddy ) గురించి తెలియని వారు లేరు.ఈయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.

 Rumours Clarity On Powerstar-surender Reddy Film, Ustaad Bhagat Singh, Og Movie-TeluguStop.com

అయితే అంతే స్థాయిలో డిజాస్టర్స్ కూడా ఈయన ఖాతాలో ఉన్నాయి.అందులో ఈ మధ్య వచ్చిన ఏజెంట్ మూవీ కూడా ఒకటి.

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది.

Telugu Og, Pawan Kalyan, Surender Reddy, Ustaadbhagat-Movie

ఈ సినిమా( Agent Movie ) బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవి చూసింది.ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయగా దారుణమైన ఫలితం వచ్చింది.దీంతో ఈయన లైనప్ లో ఉన్న పవన్ సినిమా( Pawan Kalyan ) ఆగిపోయింది అనే రూమర్స్ వచ్చాయి.

సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాంబోలో చాలా రోజుల క్రితం ఒక సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది.అయితే మొన్న పవన్ పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు.

పవన్ లైనప్ లో ఉన్న ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల నుండి వరుసగా అప్డేట్స్ వచ్చాయి.కానీ సురేందర్ రెడ్డి సినిమా నుండి మాత్రం ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందేమో అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అనుకున్నారు.

అందుకే బర్త్ డే( Pawan Kalyan Birthday )కు ఎలాంటి పోస్టర్ కానీ అప్డేట్ కానీ ఇవ్వలేదేమో అని ఫిక్స్ అయ్యారు.

Telugu Og, Pawan Kalyan, Surender Reddy, Ustaadbhagat-Movie

కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోలేదట.ఇప్పటికే ఈ సినిమా కోసం కొత్తగా ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసారని తెలుస్తుంది.అలాగే ఈ సినిమా ఇప్పటికే రీమేక్ అనే టాక్ రాగా ఇది రీమేక్ కాదని స్ట్రైట్ సినిమా అని సమాచారం.

మరి ఈ సినిమా గురించి మళ్ళీ అప్డేట్ వస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.ఇప్పటికే పవన్ సగం పూర్తి అయిన సినిమాలను ఎప్పుడు ఫినిష్ చేస్తాడో తెలియడం లేదు.

ఇక ఈ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube