పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి మూవీ ఉందా ఆగిపోయిందా.. క్లారిటీ ఇదే!
TeluguStop.com
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి( Director Surender Reddy ) గురించి తెలియని వారు లేరు.
ఈయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.అయితే అంతే స్థాయిలో డిజాస్టర్స్ కూడా ఈయన ఖాతాలో ఉన్నాయి.
అందులో ఈ మధ్య వచ్చిన ఏజెంట్ మూవీ కూడా ఒకటి.అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది.
"""/" /
ఈ సినిమా( Agent Movie ) బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవి చూసింది.
ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయగా దారుణమైన ఫలితం వచ్చింది.దీంతో ఈయన లైనప్ లో ఉన్న పవన్ సినిమా( Pawan Kalyan ) ఆగిపోయింది అనే రూమర్స్ వచ్చాయి.
సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాంబోలో చాలా రోజుల క్రితం ఒక సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది.
అయితే మొన్న పవన్ పుట్టిన రోజు నాడు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు.
పవన్ లైనప్ లో ఉన్న ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల నుండి వరుసగా అప్డేట్స్ వచ్చాయి.
కానీ సురేందర్ రెడ్డి సినిమా నుండి మాత్రం ఒక్క అప్డేట్ కూడా రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందేమో అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అనుకున్నారు.
అందుకే బర్త్ డే( Pawan Kalyan Birthday )కు ఎలాంటి పోస్టర్ కానీ అప్డేట్ కానీ ఇవ్వలేదేమో అని ఫిక్స్ అయ్యారు.
"""/" /
కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోలేదట.ఇప్పటికే ఈ సినిమా కోసం కొత్తగా ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసారని తెలుస్తుంది.
అలాగే ఈ సినిమా ఇప్పటికే రీమేక్ అనే టాక్ రాగా ఇది రీమేక్ కాదని స్ట్రైట్ సినిమా అని సమాచారం.
మరి ఈ సినిమా గురించి మళ్ళీ అప్డేట్ వస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
ఇప్పటికే పవన్ సగం పూర్తి అయిన సినిమాలను ఎప్పుడు ఫినిష్ చేస్తాడో తెలియడం లేదు.
ఇక ఈ కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి.
స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?