టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాహుబలి సృష్టికర్త రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం, తారక్, చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు సినిమా షూటింగ్‌లను నిలిపేస్తున్నారు.
కానీ కరోనా వచ్చినా తమ షూటింగ్ మాత్రం ఆగదని రాజమౌళి బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు.
తమ షూటింగ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్, తమ నెక్ట్స్ షెడ్యూల్‌ను పూణెలో చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారు.అయితే కరోనా వైరస్ సోకండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించడంతో చిత్ర షూటింగ్‌ను జరిపేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ రెడీ అయ్యింది.
ఇప్పటికే 80 శాతం చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్, అక్కడ జరగబోయే షూటింగ్‌తో టాకీ పార్ట్‌ను పూర్తి చేస్తుంది.తారక్, చరణ్, అజయ్ దేవ్గన్‌లపై కొన్ని కీలకమైన సీన్స్‌ను అక్కడ చిత్రీకరించనున్నారు.
ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడంలో జక్కన్న బిజీగా మారనున్నాడు.మొత్తానికి కరోనా దెబ్బను సైతం ఆర్ఆర్ఆర్ లెక్కచేయడం లేదని స్పష్టమవుతోంది.