టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ వసూళ్ల ను దక్కించుకుంటూ దూసుకు పోతుంది.మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.500 కోట్ల వసూళ్లు నమోదు చేయడంతో లాంగ్ రన్ లో భారీ వసూళ్ల ను సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.అయితే సినిమా భారీ వసూళ్లు నమోదు చేయాలి అంటే వీకెండ్స్ తో పాటు వీక్ డేస్ లో కూడా భారీగా వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆ వసూలు ఎలా ఉండాలి అంటే స్టార్ హీరోల సినిమా లు వీకెండ్స్ లో ఎలా వసూలు చేస్తాయో అలా కలెక్షన్స్ ఉండాలి.మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.ఆదివారం ఫుల్ రన్ పూర్తయినప్పటికీ రూ.500 కోట్ల వసూళ్ల ను నమోదు చేసిన ఈ సినిమా సోమవారం నుండి తగ్గుతుందని ప్రతి ఒక్కరు భావించారు.కానీ జనాలు ఊహించినంతగా తగ్గలేదు.
కాస్త తగ్గినా కూడా నాలుగు షో ల్లో కనీసం రెండు షో లు హౌస్ ఫుల్ కలెక్షన్స్ గా నిలబడుతున్నాయి.
ఓవరాల్ గా సినిమా సోమవారం మరియు మంగళవారం లో కూడా భారీగా వసూళ్లు నమోదు చేస్తూనే ఉంది.వీక్ డేస్ లో ఈ మధ్య కాలం లో ఈ స్థాయి లో వసూళ్ల ను సొంతం చేసుకోవడానికి మరో సినిమా కు సాధ్యం కాలేదు.ఇది రాజమౌళి సినిమా కనుకనే ఈ స్థాయి లో వసూలు నమోదవుతున్నాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.
రాజమౌళి సినిమా కనుక భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.అదే విధంగా ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా అవడం వల్ల వెయ్యి కోట్ల దిశగా దూసుకు పోతుంది.ఈ సమయం సెలవులు ఏమైనా కలిసి వస్తే ఈ సినిమా కు రూ.1500 కోట్ల వసూళ్లు పెద్ద కష్టమేమి కాదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జక్కన్న రాజమౌళి ఈ సినిమా ను విజువల్ వండర్ గా తెరకెక్కించడం తో ప్రతి ఒక్క సినీ ప్రేమికుడు ఎంతో ఆసక్తి గా ఈ సినిమా చూసేందుకు థియేటర్ల కు క్యూ కడుతున్నారు.