రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి తాజాగా ఎత్తర జెండా పాట వచ్చింది.ఆ పాటను చూస్తుంటే కన్నుల పుండుగ అన్నట్లుగా ఉంది.
ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శిస్తూ వారి అవతారాల్లో హీరోలు మరియు హీరోయిన్ కనిపించడంతో గొప్ప స్వాతంత్ర్య భావన కలుగుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎత్తర జెండా పాటల్ మంచి విజువల్స్ ఉన్నాయి.
అయితే ఇక్కడ వచ్చిన పెద్ద కన్ఫ్యూజన్ ఏంటీ అంటే ఈ పాట సినిమాలో ఉంటుందా లేదంటే కేవలం ప్రమోషనల్ సాంగ్ అయ్యి ఉంటుందా అనదే తెలియడం లేదు.ఆ పాట సినిమా లో ఉంటుందా అంటూ చాలా మంది మాకు మెసేజ్ చేస్తున్నారు.
ఆ విషయంలో మా వద్ద కూడా క్లారిటీ లేదు.కాని సినిమా విషయంలో దర్శకుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా సినిమాలో ఈ పాట ఉంటుందేమో అనిపిస్తుంది.
ఇద్దరు హీరోలు కూడా జనాల్లో స్వాతంత్ర్య కాంక్ష ను రగిల్చేందుకు సినిమా కథలో భాగంగా ఈ పాటను పాడే అవకాశాలు లేక పోలేదు.సినిమా విడుదల అయితే కాని అసలు విషయం క్లారిటీ వచ్చే అవకాశం లేదు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు ఏకంగా 550 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లగా జక్కన్న తాజాగా ప్రకటించాడు.ఆ రేంజ్ బడ్జెట్ సినిమా కనుక ఈజీగా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు అవుతాయి అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
కీరవాణి సంగీతం ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమా కు ప్రధాన ఆకర్షణ గా ఉంటుందనే నమ్మకం ను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ సినిమాలో మార్చి 25 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే
.