ఖమ్మం:బహుజన రాజ్యంతోనే బహుజనుల సమస్యలు పరిష్కారమవుతాయని,అందుకు జీవితాంతం పాటుపడిన దార్శనికుడు మాన్యశ్రీ కాన్షీరామ్ అని తెలంగాణ బహుజన జేఏసీ జిల్లా చైర్మన్ పోతగాని వెంకటేశ్వర్లు కొనియాడారు.మంగళవారం సంఘ కార్యాలయంలో కాన్షీరామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తొలుత కాన్షిరాం చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం పోతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కష్టపడితే బహుజన రాజ్యం కల సాకారం అవుతుందని.
తను జీవించి ఉండగానే దేశంలోని అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బి.ఎస్.పి ని అధికారంలోకి తీసుకోనీ రావడం ద్వారా ఆయన నిరూపించారని పేర్కొన్నారు .బహుజనులు అంతా ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో నాయకులు తీగల రాము , రవీంద్ర నాయక్ , శ్రీనివాసచారి , సలీం , వినోద్ , అఖిల్ తదితరులు పాల్గొన్నారు .