నెల్లూరు జిల్లాలో మరోసారి కుళ్లిన మాంసంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నగరంలోని హరినాధపురంలోని ఓ గోడౌన్ పై హెల్త్ ఆఫీసర్స్ దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో భారీ స్థాయిలో పురుగులు పట్టి కుళ్లిన చికెన్ నిల్వలను గుర్తించారు.సుమారు ఐదు వందల కేజీల చికెన్ తో పాటు రెండు ఫ్రీజర్ లను స్వాధీనం చేసుకున్నారు.
చికెన్ పై ఫినాయిల్ పోసి డంపింగ్ యార్డుకు తరలించిన అధికారులు అంజాద్ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.చెన్నై, కోయంబత్తూరు నుంచి తీసుకొచ్చి జిల్లాల్లోని పలు షాపులు, హోటల్స్ తో పాటు రెస్టారెంట్లకు చికెన్ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కాగా.గత నెలలోనూ నెల్లూరులో కుళ్లిన చికెన్ వెలుగులోకి వచ్చింది.
వెంకటేశ్వరపురంలో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించిన విషయం తెలిసిందే.