బుద్ది మందగిస్తే చేసే పనుల్లో అర్ధం ఉండదంటారు.ఇలాగే నేడు మనుషులు అని చెప్పుకుంటున్న వారు తలకు మాసిన పనులు చేస్తూ సమాజానికి కీడు తలపెడుతున్నారు.
వారి జల్సాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.ఇలాంటి వారిలో కొందరైతే దేవుడి హుండీలను కూడా కొల్లగొడుతున్నారు.
తాజాగా తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.ఈ ఆలయంలో చోరీకి ప్రయత్నం జరిగినట్లుగా తితిదే నిఘా విభాగం అనుమానం వ్యక్తం చేస్తోంది.
నిన్న రాత్రి ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసివేసిన సమయంలో లోపల్ ఉండిపోయిన ఆ దొంగ గోవిందరాజస్వామి ఆలయం లోని వినాయకుడి వద్ద, ధ్వజస్తంభం వద్ద ఉన్న రెండు హుండీలను కొల్లగొట్టడానికి ప్రయత్నించినట్లు గుర్తించారట అధికారులు.
గుడిలో అన్ని చోట తాళాలు వేసి ఉండటంతో ఆ దొంగ ప్రయత్నం ఫలించలేదు.
ఇక ఉదయం ఆ దొంగ భక్తుల్లో కలిసి బయటకు వెళ్లినట్లు ఆలయ భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారట.కాగా ఈ ఘటన పై తిరుపతి అర్బన్ పోలీసులకు తితిదే నిఘా సిబ్బంది సమాచారం ఇచ్చారని, వారు అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారని సమాచారం.