సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఒకరు.చిరంజీవి ( Chiranjeevi ) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఈయన తనకంటూ ఎంతో క్రేజ్ సొంత చేసుకున్నారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి నటి రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత పవన్ కళ్యాణ్ రష్యన్ కి చెందినటువంటి మరొక యువతని పెళ్లి చేసుకోవడంతో రేణు దేశాయ్ ( Renu Desai ) తనకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటుంది.
ఇలా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈమె ఒంటరిగా ఉంటూ పిల్లల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ పలు సందర్భాలలో తన ప్రేమ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రేమ పెళ్లిళ్లకు సంబంధించి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తన ప్రేమ గురించి రేణు దేశాయ్ గతంలో చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో భాగంగా ఈమె పవన్ కళ్యాణ్ తో ప్రేమ గురించి తెలిపారు.పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలు నటిస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ బద్రి( Badri ) సినిమాకు ఎంపికయ్యారు.
ఇలా కొత్త దర్శకుడు తో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారని తెలిసిందే.ఆ సినిమా ఆడిషన్ కోసం రామానాయుడు స్టూడియోకి వెళ్ళాను.
అక్కడ నేను కూర్చుని ఉండగా అప్పుడే పూరి జగన్నాథ్ అక్కడికి వచ్చారు.ఆయనతోపాటు పెద్ద హడావుడి కనిపించింది.
అప్పుడే హీరో వస్తున్నాడని అనుకున్నాను.అదే పవన్ కళ్యాణ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా వచ్చి కూర్చున్నారు.
అలా ఆయన సింప్లిసిటీ( Simplicity ) చూసి తాను ఫిదా అయ్యానని మొదటి చూపులోనే తాను పడిపోయాను అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.