తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు.
అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలపై తెలంగాణ ఏర్పడిందని చెప్పారు.పదేళ్లలో జరిగిన ఆర్థిక అరాచకాలు, తప్పిదాలు ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు.
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల వనరులను గత ప్రభుత్వం అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించలేకపోయిందని తెలిపారు.ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఉందన్న భట్టి విక్రమార్క ఆ దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఈ క్రమంలోనే ప్రజాతీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు తెలిపారు.శ్వేతపత్రాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని ప్రజల అభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.