నేను అన్నం కూడా తినలేదు.. నా వల్ల కావట్లేదని చెప్పినా వినరా.. పల్లవి ప్రశాంత్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss season 7 ) విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు.అయితే పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనపై ఊహించని స్థాయిలో నెగిటివిటీ పెరుగుతోంది.

 Pallavi Prashanth Comments Goes Viral In Social Media Details Here , Pallavi-TeluguStop.com

తనపై వచ్చిన నెగిటివిటీ గురించి పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ అన్నా నేను మళ్లొచ్చినానని నాకు చాలా బాధగా ఉందని అన్నారు.ఈరోజు బాధపడే రోజని రైతుబిడ్డ గెలిచాడని నా ఊరు నాకు ఘనస్వాగతం పలికిందని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.

అలా ఘన స్వాగతం పలకడాన్ని మీడియా మిత్రులు మీరే చూశారని ఆయన వెల్లడించారు.ఇంతమంది ప్రజలు నాకోసం వచ్చారా అనే సంతోషంలో నేనున్నానని కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీడియా మిత్రులు అనుకుంటున్నారని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.

నిజంగా బాధగా ఉందని ఏడుద్దామంటే నెగిటివ్ చేస్తారేమో అని భయంగా ఉందని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చారు.

60 నుంచి 70 యూట్యూబ్ ఛానెళ్లు వచ్చాయని వాళ్లకు ఫోటోలు, వీడియోలు ఇచ్చానని నేను అన్నం కూడా తినలేదని పల్లవి ప్రశాంత్ అభిప్రాయపడ్డారు.కొంతమంది మీడియా మిత్రులు 5 నిమిషాలు ఇవ్వు.పది నిమిషాలు ఇవ్వు అని వెంటపడ్డారని ఆయన కామెంట్లు చేశారు.

నేను కూడా మనిషినే అని నా వల్ల అయితలేదని పల్లవి ప్రశాంత్ పేర్కొన్నారు.మరోవైపు కేసులు నమోదు కావడంతో ప్రశాంత్ పరారీలో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విఛాఫ్ లో ఉందని మూడు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయని సమాచారం అందుతోంది.ఆర్టీసీ బస్సులపై( RTC buses ) రాళ్లు రువ్విన వాళ్లను గుర్తించడానికి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.పరారీలో ఉన్నాడనే వార్తల గురించి పల్లవి ప్రశాంత్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.పల్లవి ప్రశాంత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube