ఆహా ఒరిజినల్ 'అన్య'స్ ట్యుటోరియల్' టీజర్ ను లాంచ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

ఆహా అంటే ఆహా అనిపించే రీతిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా వారి హారర్ వెబ్ సిరీస్ ‘అన్య’స్ ట్యుటోరియల్‘ టీజర్ ను శుక్రవారం సాయంత్రం లాంచ్ చేసారు.రెజీనా కెసాండ్రా మరియు నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది.

 Rebel Star Prabhas Launches Aha Original 'anya's Tutorial' Teaser 'anya's Tutori-TeluguStop.com

ఆహా ఈ వెబ్ సిరీస్ తెలుగు మరియు తమిళ్ భాషలలో అతి త్వోరలోనే లాంచ్ చేయనుంది.టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, “అన్య’స్ ట్యుటోరియల్ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

ఈ టీజర్ లాంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది.అల్ ది బెస్ట్ టు టీం అఫ్ అన్య.”

ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ దిక్కు అడుగులు వేస్తుంది.కానీ అదే డిజిటల్ రంగం అందరిని భయపెడితే? అదే అన్య’స్ ట్యుటోరియల్.అన్య (నివేదితా సతీష్) ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంది.రెజీనా కెసాండ్రా (మధు) కి తన చెల్లి అన్య ప్రొఫెషన్ అంటే నచ్చదు.కానీ ఒక రోజు మొత్తం మారిపోతుంది.ఎవరూ చూడని విధంగా సైబర్ ప్రపంచం మొత్తం భయపడుతుంది.

అసలు ఎందుకు? అని తెలుసుకోవాలంటే ఆహా మరియు ఆర్కా మీడియా వారి ‘అన్య’స్ ట్యుటోరియల్’ చూడాల్సిందే.అభిమానుల కోసం ఆహా వారు ఈ వెబ్ సిరీస్ ను తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube