కన్నడ నటి సౌజన్య మృతికి అసలు కారణమిదే.. ఆ లెటర్ లో ఏముందంటే?

ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందిన పాపులర్ సెలబ్రిటీలలో కొందరు వేర్వేరు కారణాల వల్ల డిప్రెషన్ కు గురవుతూ ఆత్మహత్య చేసుకుంటున్నారు.సినిమా రంగం అంటే రంగుల ప్రపంచం అనే సంగతి తెలిసిందే.

 Reasons Behind Kannada Actress Soujaya Suicide Letter Goes Viral, Goes Viral, In-TeluguStop.com

ఈ రంగంలో అవకాశాలు వచ్చి నటనతో గుర్తింపును సంపాదించుకున్న వాళ్లు ఆర్థికంగా స్థిరపడుతుండగా మరికొందరు మాత్రం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండటం గమనార్హం.

కన్నడ సినీ నటి సౌజన్య బెంగళూరులోని అపార్టుమెంట్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

సౌజన్య సూసైడ్ లెటర్ లో అమ్మానాన్నలను క్షమించాలని కోరారు.నిన్ననే మీతో మాట్లాడానని ఇంటికి వస్తానని కూడా తాను చెప్పానని అయితే తనకు కష్టంగా ఉందని సౌజన్య లేఖలో పేర్కొన్నారు.

తాను భరించలేకపోతున్నానని అందువల్లే శాశ్వతంగా దూరమైపోతున్నానని సౌజన్య లేఖలో వెల్లడించారు.

జీవం లేకుండా తల్లిదండ్రుల ముందుకు వస్తున్నానని సౌజన్య లేఖలో చెప్పుకొచ్చారు.

Telugu Soujanya Letter, Sowjanya, Letter, Tv Offers-Movie

తనను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని, తన మానసిక స్థితి సైతం బాగా లేదని సౌజన్య లేఖలో పేర్కొన్నారు.పోలీసులు ఏడాదిన్నరగా సౌజన్య ఒంటరిగా అపార్టుమెంట్ లో నివశిస్తున్నారని చెప్పుకొచ్చారు.ఈరోజు ఉదయం 11 గంటలకు ఆమె ఆత్మహత్య గురించి సమాచారం అందిందని రామనగర్ ఎస్పీ గిరీశ్ వెల్లడించారు.

Telugu Soujanya Letter, Sowjanya, Letter, Tv Offers-Movie

పోస్టుమార్టం తర్వాత సౌజన్య మృతికి సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.సినిమాలు, సీరియళ్లలో నటించిన సౌజన్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత సినిమా, టీవీ ఆఫర్లు తగ్గడంతో సౌజన్య నిరాశానిస్పృహలకు లోనయ్యారు.

ఒకవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు సినిమా, టీవీ ఆఫర్లు తగ్గడం ఆమెను మానసికంగా కృంగదీశాయని తెలుస్తోంది.కొడగు ఆమె స్వస్థలం కాగా బెంగళూరులో ఒంటరిగా సౌజన్య నివాసం ఉంటున్నారు.

గతంలో కూడా పలువురు నటీనటులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube