మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘బెంగళూరు డేస్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే.మొదట ఈ సినిమాలో హీరో హీరోయిన్గా సిద్దార్థ్ మరియు సమంతలు నటిస్తున్నట్లు నిర్మాతలు దిల్‌రాజు మరియు ప్రసాద్ వి పొట్లూరిలు అధికారికంగా ప్రకటించారు.
అయితే కొన్ని కారణాల వల్ల వారు రీమేక్ నుండి తప్పుకున్నారు.ఆ తర్వాత సిద్దార్థ్ స్థానంలో నాగచైతన్యను సంప్రదించారు.
అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నాగచైతన్య ఆ ప్రాజెక్ట్‌ను కాదన్నాడు.
చైతూ వద్దనుకున్న ‘బెంగళూరు డేస్’ సినిమా రీమేక్‌కు రానా ఓకే చెప్పాడని తెలుస్తోంది.
ఈ రీమేక్‌లో ముగ్గురు హీరోలు నటించనున్నారు.వారిలో ఇద్దరు తమిళం నుండి కాగా మరో హీరోగా రానా నటించనున్నాడు.
ఇక సినిమాలో హీరోయిన్గా తెలుగమ్మాయి శ్రీదివ్యను ఎంపిక చేశారు.మార్చిలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు ఇప్పటికే రెడీగా ఉన్నాడు.స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈ సినిమా తెలుగు మరియు తమిళంలో ఒకే సారి చిత్రీకరణ జరుపుకోనుంది.