హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు నుంచి రామచంద్రభారతి విడుదల అయ్యారు.నకిలీ పాస్ పోస్టు కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
కాగా ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ రామచంద్రభారతి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
దీంతో ఆయన చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు.కాగా ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో రామచంద్రభారతి ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.