“బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. సినిమా ప్రారంభించిన టైంలో 2020 జూన్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించగా ఆ తరువాత షూటింగ్ ఆలస్యం కావడంతో.రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది.ఇక అదే సమయంలో మహమ్మారి కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వటంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు మొత్తం తల్లకిందులు కావడంతో “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ఇక ఇదే సమయంలో సినిమా విడుదల తేదీలు కూడా వాయిదా పడుతూ వచ్చాయి.
అయితే ఇటీవల జనవరి ఏడవ తారీఖున రిలీజ్ చేయాలని దాదాపు బాలీవుడ్ ఇంకా సౌత్ ఇండస్ట్రీలో పలు చోట్ల ప్రమోషన్ కార్యక్రమాలు.
కంప్లీట్ చేయగా సరిగ్గా విడుదల సమయంలో ఒమీక్రన్ వైరస్ రావటంతో… దేశ వ్యాప్తంగా పలు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు సినిమా థియేటర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆర్ఆర్ఆర్ .సంక్రాంతికి రావాల్సిన సినిమా వాయిదా పడింది.అయితే తాజాగా మార్చి 25 వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడు అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించడం సంచలనంగా మారింది.ఫస్ట్ టైం ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.